KCR & Revanth : రేవంత్ అందుకే నాపై కక్ష కట్టాడు – కేసీఆర్

ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్‌ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు

Published By: HashtagU Telugu Desk
CM Revanth Wishes

Kcr Revanth Clash

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదే పదే మీపై ఘాటైన పదజాలం ఎందుకు వాడుతున్నాడు..? అసలు మీపై ఎందుకు ఆయనకు అంత కోపం..? వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే ప్రశ్నలకు కేసీఆర్ సమాదానాలు ఇచ్చారు. ఈరోజు మంగళవారం ఓ టీవీ చర్చలో పాల్గొన్న కేసీఆర్ (KCR).. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై సమాదానాలు చెప్పుకొచ్చారు. వాటిలో రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్‌ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.ఓటుకు నోటు కేసులో రేవంత్ పట్టుబడ్డారని.. తెలంగాణను అస్థిరపరిచేందుకు రేవంత్ కుట్ర చేసారని..రేవంత్ అరెస్ట్ వెనుక తన హస్తం ఉందని చెప్పి నాపై కక్ష పెంచుకున్నారు. అందుకే ఇలా విమర్శలు చేస్తున్నాడని కేసీఆర్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ కావడం పై కూడా కేసీఆర్ స్పందించారు. లిక్కర్‌ స్కామ్‌ అనేది అదొక బోగస్‌ అని, నా కూతురు కవిత(Kavitha)కు ఏమి తెలిదని, ఈ కేసులో తాను పోరాడుతున్నానని, నా కూతురు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. అలాగే పదేళ్ల పాటు తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన..రైతులకోసం ఎన్నో స్కిం లు తీసుకొచ్చిన ప్రజలు ఎందుకు బిఆర్ఎస్ ను ఓడించారు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీల వల్లే తాము ఓడిపోయాం తప్ప..బిఆర్ఎస్ సరిగా పాలన చేయడంలేదని కాదు..మా నేతలు బాగా పని చేయలేదని కాదు..కేవలం కాంగ్రెస్ 420 హామీల వల్లే ఓడిపోయాం..అది కూడా ఎంతో పెద్ద తేడా కాదు 39 ఎమ్మెల్యేలు గెలిచారు. ఓడిన నేతలు కూడా కొద్దీ గొప్ప తేడాతో ఓడిపోయారు తప్ప పెద్ద తేడాతో కాదన్నారు. ఏదీఏమైనా బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తానే సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేసారు.

Read Also : KTR : కేంద్రంలో మా మద్దతు కావాల్సిందే..!

  Last Updated: 23 Apr 2024, 10:19 PM IST