కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర…అక్టోబర్ 24న తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో రాహుల్ యాత్రకు సంబంధించి పరిస్థితులను సమీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం హైదరాబాద్ వచ్చారు. గాంధీభవన్ లో టీపీసీసీ నేతలతో ఆయన సమావేవం అయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంబంధించి తెలంగాణలో అసలు ప్రచారంమే లేదు…మీరేం చేస్తున్నారు..ఎందుకు పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి…పబ్లిసిటీలో అందరికంటే ముందు వరుసలో ఉంటారు…మరి భారత్ జోడో యాత్రను ఎందుకు పబ్లిసిటీ చేయడం లేదంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికైనా జోడో యాత్ర ప్రచారాన్ని పెంచాలంటూ రేవంత్ రెడ్డికి సూచించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశ్ చంద్ రెడ్డికి క్లాస్ పీకారు వేణుగోపాల్ రెడ్డి. యాత్రలో మీరు సత్తా చాటుతున్నారంటూ ప్రశంసలు కురింపించడంతో..యాత్ర గురించి మాట్లాడమంటే నన్ను పొగుడుతారేమిటని కేసీ వేణుగోపాల్ వారించారు.