తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ(BRS)లో అంతర్గత కుమ్ములాటలను స్పష్టం చేస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత(Kavitha), తన సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై తీవ్ర విమర్శలు చేశారు. తనకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, తనను ఎందుకు పట్టించుకోలేదని ఆమె నిలదీశారు.
Kavitha Press Meet : హరీష్ రావు …రేవంత్ కాళ్లు పట్టుకొని సరెండర్ అయ్యారు – కవిత
‘నేను మీ చెల్లిని. పార్టీ కార్యాలయంలో కొందరు నాపై కుట్రలు చేస్తున్నారని నేను చెప్పాను. అప్పుడు ‘ఎందుకు బాధ పడుతున్నావ్ చెల్లి’ అని ఒకసారి కూడా ఫోన్ చేయవా?’ అని కవిత ప్రశ్నించారు. రక్త సంబంధాన్ని పక్కన పెట్టినా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఒక ఎమ్మెల్సీగా తనతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆమెను తీవ్రంగా బాధించింది. 103 రోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక కేసీఆర్ కూతురికే ఈ పరిస్థితి ఎదురైతే, పార్టీలోని ఇతర మహిళా నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ పార్టీలో మహిళా నేతల భద్రత, గౌరవంపై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. కవిత చేసిన ఈ ఆరోపణలు పార్టీలో కేటీఆర్ స్థానం, ఆయన వ్యవహారశైలిపై చర్చకు దారితీశాయి.