తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలో లేకపోయినా, ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (BRS) అంతర్గత కలహాలతో అట్టుడుకుతోంది. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మాధవరం కృష్ణారావు నేరుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత కొద్దీ రోజులుగా కవిత తీరు ఫై కే బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం నింపుతున్న సంగతి తెలిసిందే. హరీష్ రావు , కేటీఆర్ లపైనే కాదు మాజీ మంత్రులపై వరుసపెట్టి కీలక వ్యాఖ్యలు చేస్తూ కవిత ఆగ్రహం నింపుతుంది.
ఈ క్రమంలో మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ ను అరెస్టు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు నిరాధారమని ఖండించిన కృష్ణారావు, అసలు సమస్య పార్టీ అంతర్గత సంక్షోభమేనని స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వెనుక బీఆర్‌ఎస్ నాయకత్వ మార్పు, అంతర్గత ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది.
Tollywood : ఈ వారం సినిమాల జాతర అఖండ 2! థియేటర్లలో ఏకంగా 8 చిత్రాల రిలీజ్..
కవిత వైఖరి కేసీఆర్ మరియు పార్టీ పరువును తీసే విధంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఆర్థిక మంత్రిగా ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన హరీశ్రావును పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు కవిత ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను అరెస్టు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఆమె రహస్యంగా ప్రణాళికలు రచిస్తున్నారని కృష్ణారావు దుయ్యబట్టారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఆధిపత్యం కోసమే పనిచేస్తున్నారని, రాష్ట్ర సంపదను దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో కవిత, కేటీఆర్ వర్గాల మధ్య ఉన్న కోల్డ్‌వార్ ఈ ప్రకటన ద్వారా బహిరంగమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
