Site icon HashtagU Telugu

Kavitha : ఈడీ కస్టడీలో పలు మినహాయింపులు కోరిన కవిత.. కోర్టు ఆమోదం

Kavitha Sought Many Exempti

Kavitha Sought Many Exempti

 

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)ను ఈడీ కస్టడీ(ED Custody)లో తనకు పలు మినహాయింపులు కావాలని శనివారం కోరారు. అయితే కోర్టు వీటికి ఆమోదం తెలిపింది. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తాను బంధువుల(Relatives)ను కలిసేందుకు అనుమతివ్వాలని, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే తనకు పుస్తకాలు(Books)చదివేందుకు వెసులుబాటు కల్పించాలని… కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి అనుమతివ్వాలని కోరారు. తనకు స్పెడ్స్ (అద్దాలు)కు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిన్నింటికి న్యాయస్థానం ఓకే చెప్పింది. అలాగే ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం(Meals from home) తెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరగా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. కవితను మార్చి 23వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయిస్తారు. ఈడీ అధికారులు ఆమెను ఈడీ కార్యాలయానికి తరలించారు.

read also: BRS Party: తెలంగాణ లో బిఆర్ఎస్ పటిష్టం గా ఉంది: కడియం శ్రీహరి

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడికి అనుమతించింది. ఈ నెల 23 వరకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రతిరోజు లాయర్లను కలిసేలా వీలు కల్పించింది. అదే సమయంలో ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కవితకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరుపరుచాలని ఈడీని ఆదేశించింది.