MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కవిత భేటీ, అభివృద్ధి పనులపై ఆరా!

ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Kavitha

Kavitha

ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం రోజున ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ మధుసూదన చారి నేతృత్వంలో విశ్వ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పెద్దలతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. బోధన్ నియోజకవర్గంలోని మండలంలో పలు అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి అంశాలపై కవితతో ఎమ్మెల్యే షకీల్ చర్చించారు.

ముఖ్యంగా రోడ్లు, సాగునీటి కాలువల అభివృద్ధి పై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలపై మంతనాలు జరిపారు. సింగరేణి ప్రాంత నియోజకవర్గాల స్థానిక ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ ‌కవిత మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు కవితని కలిసి వినతి పత్రం అందించారు. వారి వినతుల పట్ల కవిత సానుకూలంగా స్పందించారు.

Also Read:NBK’s Bhairava Dweepam: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, భైరవద్వీపం రీరిలీజ్

  Last Updated: 25 Jul 2023, 04:19 PM IST