Kavitha: మోడీ ముందు కవిత కుప్పిగంతులు

మోడీ ముందు కుప్పిగంతులు వేయడానికి తెలంగాణ సీఎం కుమార్తె కవిత సిద్ధం అయ్యారు. మహిళ రిజర్వేషన్లు కోసం అంటూ లాజిక్ లేకుండా ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు.

  • Written By:
  • Updated On - March 10, 2023 / 10:53 AM IST

మోడీ ముందు కుప్పిగంతులు వేయడానికి తెలంగాణ సీఎం కుమార్తె కవిత (Kavitha) సిద్ధం అయ్యారు. మహిళ రిజర్వేషన్లు కోసం అంటూ లాజిక్ లేకుండా ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పడు ఆ అంశానికి సమాధానం చెప్పకుండా దేశ వ్యాప్త రిజర్వేషన్ కోసం దీక్షకు దిగడం విమర్శలకు దారితీస్తుంది. కేవలం ఈడీ అరెస్ట్ నుంచి జనం దృష్టి మరల్చడానికి పొలిటికల్ గేమ్ ప్రారంభించారని ఆరోపణలు కోకొల్లలు. తెలంగాణలో కేసీఆర్ ఢిల్లీలో లో కవిత ఈడీ కదలికలను అనుగుణంగా రాజకీయ క్రీడను ప్రారంభించారు. పార్టీ వర్గాలతో శుక్రవారం కేసీఆర్ మీటింగ్ పెట్టారు. దీక్షకు 18 పార్టీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించినట్టు ఎమ్మెల్సీ కవిత నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించారు. కవిత (Kavitha) నిర్వహించబోయే దీక్షకు సిపిఐ, సిపిఎంతో పాటుగా సమాజ్వాది పార్టీ, డిఎంకె, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సిపి, టిఎంసి, శివసేన, జేడీయు, ఆర్జెడి, ఆర్ ఎల్ డి, జే యం యం, పీడిపి తో పాటు మొత్తం 18 పార్టీలు సంఘీభావం ప్రకటించినట్టు ఆమె చెప్పారు.

ఈ నిరసన దీక్ష ద్వారా కవిత తమ బలాన్ని కేంద్రం ముందు ప్రదర్శించబోతున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని కవిత (Kavitha) డిమాండ్ చేస్తున్నారు. అలా ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ లభిస్తుందని కవిత చెబుతున్నారు. భారత జాగృతి సంస్థ ద్వారా ఈ ధర్నా నిర్వహిస్తున్న కవిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాదు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని స్పష్టం చేస్తున్నారు. అందుకు ముందుగానే ప్రకటించిన క్రమంలో ఢిల్లీలో దీక్ష, ధర్నా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర శుక్రవారం దీక్ష, ధర్నా చేయడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించారు. నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు కవిత దీక్షకు ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. అయితే ఆమె చెప్పినట్టు 18 పార్టీలు సంఘీభావం ఉండదని తెలుస్తుంది. ఒక వేళ దీక్ష వద్దకు వచ్చినప్పటికీ సెకండ్ గ్రేడ్ లీడర్ లు మాత్రం కనిపిస్తారని సమాచారం. ఇప్పుడున్న పరిస్తుతుల్లో కవితకు మద్దతు ఇస్తే లిక్కర్ స్కామ్ కు సానుకూలంగా ఉన్నట్టు ఫోకస్ అవుతుందని నార్త్ పార్టీ లు ఆలోచనలో పడ్డాయని తెలుస్తుంది. దీంతో మోడీ ఎదుట బల నిరూపణ ఆంజనేయుని ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉందని బీజేపీ భావిస్తుంది.

Also Read:  CBI – ED: 2స్టేట్స్ సీఎం ల ఇంటి గుట్టు! సీబీఐ-ఈడీ ఉచ్చులో అవినాష్, కవిత!!