Kavitha Vs Harish Rao : ఆ విషయంలో మాత్రమే హరీష్ రావు పై కోపం – కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha Vs Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తప్ప హరీశ్ రావు(Harishrao)పై ఎటువంటి కోపం లేదని, ఆ ప్రాజెక్ట్‌పై తీసుకున్న నిర్ణయాలు అన్నీ కేసీఆర్‌వేనని కమిషన్ ముందే హరీశ్ స్పష్టంచేశారని కవిత పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Harish Rao Kavitha

Harish Rao Kavitha

MLC కవిత (Kavitha) తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. పార్టీ స్థాపనకు ముందుగా తన తండ్రి కేసీఆర్ (KCR) వందలాది మందితో చర్చించినట్లే తానూ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్‌ చేయబడిన మొదటి కుమార్తెగా తనను తాను గుర్తు చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తప్ప హరీశ్ రావు(Harishrao)పై ఎటువంటి కోపం లేదని, ఆ ప్రాజెక్ట్‌పై తీసుకున్న నిర్ణయాలు అన్నీ కేసీఆర్‌వేనని కమిషన్ ముందే హరీశ్ స్పష్టంచేశారని కవిత పేర్కొన్నారు.

Green Card : ఇక గ్రీన్ కార్డు అనేది మరచిపోవాల్సిందేనా..?

తనతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నాయకుల జాబితా చాలా పెద్దదని కవిత వెల్లడించారు. ప్రస్తుతం తాను “ఫ్రీ బర్డ్”గా అన్ని అవకాశాలకూ తెరిచి ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవ్వరూ తనను సంప్రదించలేదని, తానూ ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి తన పేరును ప్రస్తావించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సీఎం కాంగ్రెస్‌ను విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందేమో అని పరోక్ష విమర్శలు చేశారు.

అదే సమయంలో బనకచర్ల అంశంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కవిత తెలిపారు. ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపు విషయంలో సీఎం రేవంత్ స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి తాను ఎప్పుడూ పక్కన ఉండబోనని స్పష్టంచేసిన కవిత, తన రాజకీయ భవిష్యత్తు ఇంకా తెరపై ఉందని సూచించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత తదుపరి అడుగు ఏంటన్నదానిపై ఊహాగానాలు మళ్లీ వేడెక్కాయి.

  Last Updated: 20 Sep 2025, 03:20 PM IST