ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Case)లో ఈడీ అధికారులు కవిత(BRS MLC Kavitha)ను మార్చి 15న అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్ జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎంతగానో ట్రై చేసిన కుదరకపోవడం తో సుప్రీం కోర్ట్ (Supreme Court) ను ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్ట్ లో విచారణ విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని వివరించింది.
We’re now on WhatsApp. Click to Join.
అంతకు ముందు కవిత తరుపు లాయర్ ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్ రోహత్గి, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకూ వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు. ఇక కవిత కు బెయిల్ రావడం తో బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
కవిత ఈరోజు సాయంత్రంలోపు తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరఫు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు. ఇక కవితకు ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.