Site icon HashtagU Telugu

Kavitha First Day In Tihar Jail : తీహార్ జైల్లో దిగులు..దిగులుగా కవిత

Kavitha Jail 1st Day

Kavitha Jail 1st Day

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్ట్ (Arrest) అయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)ను అధికారులు తిహార్ జైలుకు తరలించారు. ఈడీ కస్టడీ ఈరోజు తో ముగియడంతో ఆమెను రౌస్అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా కవితకు కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో జైలు వ్యానులో ఆమెను తరలించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక తీహార్ జైల్లో కవితకు ఖైదీ నంబర్ 666ను కేటాయించారు జైలు అధికారులు. అయితే మొదటిరోజు ఆమె చాలా డల్‌గా ఉన్నారని అధికారులు చెప్పుకొచ్చారు. ఆమెకు ఇంటి నుంచే భోజనం, బ్లాంకెట్లు లాంటి సదుపాయాలు కల్పించారట.. కానీ కవిత మాత్రం సరిగ్గా తినలేదని , నిద్ర కూడా సరిగా పోలేదని చాల దిగులు దిగులుగా ఉన్నారని జైలు అధికారులు తెలిపారు. అలాగే కవితకు పుస్తకాలు, పెన్నులు లాంటి సదుపాయాలు కల్పించినప్పటికీ.. వాటి మీద కూడా దృష్టిని పెట్టలేకపోయారని , పుస్తకాలు కాసేపు చదివారు కానీ మళ్ళీ వాటిని పక్కన పడేసి ఆలోచనల్లోకి వెళ్ళిపోయారని తెలిపారు. ఇక ఈరోజు ఉదయం కూడా కవిత డల్‌గా కనిపించారు. బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదని తెలిపారు. మొత్తానికి కవిత తొలిరోజు తీహార్ జైలులో అన్యమనస్కంగానే గడిపారని తెలుస్తోంది.

Read Also : Phone Taping : ఫోన్‌ ట్యాపింగ్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లది ఒక్కటే మాట..!