Kavitha:క‌విత సేఫ్‌?ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ మూడో ఛార్జిషీట్ దాఖ‌లు

`ఏం కాదు ధైర్యంగా వెళ్లి రా..` అంటూ ఈడీ విచార‌ణ‌కు వెళ్లిన క‌వితకు(Kavitha) తెలంగాణ

  • Written By:
  • Updated On - April 6, 2023 / 05:46 PM IST

`ఏం కాదు ధైర్యంగా వెళ్లి రా..` అంటూ ఈడీ విచార‌ణ‌కు వెళ్లిన క‌వితకు(Kavitha) తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన తొలి ప‌లుకులు. తొలిసారి ఆమె.(Delhi Liquor Scam) ఢిల్లీ విచార‌ణ‌కు వెళుతున్న‌ప్పుడు కుమార్తెకు ఆయ‌న చెప్పిన ధైర్య వ‌చ‌నాలు. అదే ధైర్యం ఆమెను ఈడీ విచార‌ణ నుంచి బ‌య‌ట‌ప‌డేలా చేసింది. సుదీర్ఘంగా క‌విత‌ను విచారించిన ఈడీ ఆమె పేరు లేకుండా ఢిల్లీ లిక్క‌ర్ లోని మూడో ఛార్జిషీట్ ఉంది. అంటే, క‌విత క్షేమంగా ఆ స్కామ్ నుంచి బ‌య‌ట ప‌డ్డార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

క‌విత పేరు లేకుండా ఢిల్లీ లిక్క‌ర్ లోని మూడో ఛార్జిషీట్

దిల్లీ మద్యం కేసులో (Delhi Liquor Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం ఈడీ మూడో ఛార్జిషీట్‌ వేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, రాజేశ్‌ జోషి, గౌతమ్‌ మల్హోత్రలపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఫిబ్రవరి 7న గౌతమ్ మల్హోత్ర, ఫిబ్రవరి 8న రాజేశ్‌ జోషి, మాగుంట రాఘవను ఫిబ్రవరి 10న అరెస్టు చేసినట్లు ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై ఈ నెల 14న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది. కేసు దర్యాప్తునకు సంబంధించి ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అనే విషయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చనుంది.

సీబీఐ ప్రత్యేక కోర్టులో  ఈడీ మూడో ఛార్జిషీట్‌ (Delhi Liquor Scam)

తొలి చార్జి షీట్ లో రామ‌చంద్ర పిళ్లై ఇచ్చిన వాగ్మూలం ప్ర‌కారం క‌విత (Kavitha) పేరును ఈడీ ప్ర‌స్తావించింది. అంతేకాదు, ప‌లు ర‌కాలు ఫోన్ల‌ను ఉప‌యోగించిన‌ట్టు తెలిపింది. తొలి రెండు ఛార్జి షీట్ల‌లో ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ఆమె ప్ర‌మేయంపై ప్ర‌స్తావ‌న జ‌రిగింది. కానీ, మూడో చార్జి షీట్ లో  క‌విత పేరు ఊసెత్త‌లేదు. అంటే, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్. (Delhi Liquor Scam)  నుంచి క‌విత క్షేమంగా బ‌య‌ట‌ప‌డింద‌ని అర్థ‌మ‌వుతుంది. అయితే, మూడో చార్జి షీట్ లో సౌత్ గ్రూప్ కింగ్ పిన్ గా ఉన్న రామ చంద్ర‌పిళ్లై పేరును కూడా క‌నిపించ‌లేదు. అంతేకాదు, క‌విత విచార‌ణ‌కు సంబంధించిన ఎలాంటి ప్ర‌స్తావ‌న చేయ‌లేదు. క‌నీసం ఆమెను విచారించిన సంద‌ర్భంగా ఏమి జ‌రిగింది? అనేది కూడా ఎక్క‌డా పొందుప‌ర‌చ‌లేదు.

  సుప్రీం కోర్టులో పిటిష‌న్

అటు రాజ‌కీయంగా ఇటు చ‌ట్ట ప‌రంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ (Delhi Liquor Scam) లోని క‌విత ప్ర‌మేయం, విచార‌ణ సంచ‌ల‌నం క‌లిగించింది. మూడు రోజులు వ‌రుస‌గా ఆమెను ఈడీ విచారించింది. ఏ మాత్రం ద‌డ‌క‌కుండా క‌విత విచార‌ణ‌ను ఫేస్ చేశారు. మూడోరోజు ఆమె ఉప‌యోగించిన సెల్ ఫోన్ల‌ను కూడా మీడియా ఎదుట ప్ర‌ద‌ర్శించారు. తొలి రోజు కొంత బెరుగ్గా ఈడీ కార్యాల‌యంకు వెళ్లిన‌ట్టు క‌నిపించారు. కానీ, రెండు,మూడోసారి వెళ్లిన‌ప్పుడు ఏ మాత్రం భ‌యం లేకుండా విచార‌ణ గ‌దిలోకి వెళ్లారు. ఒక మ‌హిళ‌కు ఉన్న హ‌క్కుల‌ను కూడా ఆమె ప్ర‌శ్నించారు. ఆ మేర‌కు సుప్రీం కోర్టులో పిటిష‌న్ కూడా వేశారు. సాయంత్రం ఆరు గంట‌ల త‌రువాత విచార‌ణ ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నిస్తూ పిటిష‌న్ దాఖ‌లు పరిచారు. అంతేకాదు, విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు చ‌ట్టం ఇచ్చిన వెసుల‌బాటును తెర‌మీద‌కు తీసుకొచ్చారు.

Also Read : Kavitha BRS : డాట‌ర్ ఆఫ్ పైట‌ర్ గ్రాఫ్ పైపైకి! బీజేపీ ఢ‌మాల్‌!

ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో ఈడీ మీద క‌విత (Kavitha) వేసిన పిటిష‌న్ ఉంది. ఈడీ విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళ ప‌ట్ల వ‌హ‌రించాల్సిన తీరుపై సుప్రీం కోర్టు విచార‌ణ చేప‌ట్టాల్సి ఉంది. ఆ పిటిష‌న్ సుప్రీం కోర్టులో ఉండ‌గానే, క‌విత విచార‌ణ ముగిసింది. ఆ విచార‌ణ సంద‌ర్భంగా క‌విత ఈడీ అధికారుల‌కు ప‌లు ఎదురు ప్ర‌శ్న‌లు వేశార‌ని బీఆర్ఎస్ మీడియా ముఖంగా వెల్ల‌డించింది. కానీ, బీజేపీ తెలంగాణ లీడ‌ర్లు మాత్రం క‌విత అరెస్ట్ ఖాయ‌మంటూ ప్ర‌చారం చేశారు. అందుకు భిన్నంగా ఆమె విచార‌ణ ముగిసింది. ఇప్పుడు మూడో చార్జి షీట్ లో క‌విత పేరును ఎక్క‌డా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం రాజ‌కీయంగా బీజేపీకి న‌ష్టం క‌లిగించే అంశం. సానుకూల రాజ‌కీయ వాతావార‌ణం క్రియేట్ చేసుకోవ‌డానికి కేసీఆర్ కు ఒక మంచి అవ‌కాశం. మొత్తం మీద కేసీఆర్ తొలి రోజు చెప్పిన ధైర్యం వ‌చ‌నాలు క‌విత నాయ‌క‌త్వాన్ని పెంచింది.

Also Read : BJP-BRS : తెలంగాణ‌పై మోడీ షెడ్యూల్! `ఫూల్స్ వార్` హీట్‌!