- రాష్ట్ర వ్యాప్తంగా కవిత కామెంట్స్ పై చర్చ
- కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశాడా ?
- ప్రజల బాగోగుల కంటే కుటుంబ వారికే ప్రాధాన్యత ఇచ్చాడా ?
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రజలు చూపిన ఆదరణ అసమానమైనది. ఒక భావోద్వేగపూరితమైన పోరాటం నుండి ఉద్భవించిన నమ్మకం అది. పదేళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు, ఆయనను కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాకుండా రాష్ట్ర ప్రదాతగా భావించారు. అయితే, అధికారం పెరిగే కొద్దీ ఆ నమ్మకం కుటుంబ పాలన నీడలోకి వెళ్లిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దీ రోజులుగా కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను షాక్ కు గురి చేస్తున్నాయి.
Kavitha Crying
కేసీఆర్ ప్రజల ఆకాంక్షల కంటే తన కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకే ప్రాధాన్యత ఇచ్చారనే భావన సామాన్యుల్లో బలపడుతోంది. స్వార్థం లేని నాయకుడిగా మొదలై, చివరకు తన చుట్టూ ఉన్న స్వార్థ ప్రయోజనాల కోసమే వ్యవస్థను వాడుకున్నారనే ఆరోపణలు నేడు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు పాలనాపరమైన వైఫల్యాల గురించి ఆలోచిస్తే, ఎనిమిది లక్షల కోట్ల అప్పుల భారం తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల పేరుతో జరిగిన వ్యయం ప్రజల నెత్తిన తీర్చలేని రుణభారాన్ని మోపాయి. ఒకవైపు పాలన ఫామ్ హౌస్ కే పరిమితమైందనే విమర్శలు, మరోవైపు అల్లుడు, కొడుకు ఆధిపత్య పోరులో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పడ్డాయనే వాస్తవాలు ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. నాడు ఇచ్చిన హామీలు నెరవేరకపోగా, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజలకు చేసిన అతిపెద్ద ద్రోహంగా మేధావులు అభివర్ణిస్తున్నారు.
ఈ మాయా భ్రమల నుండి తెలంగాణ ప్రజలు నేడు బయటపడ్డారు. పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రయత్నం చేస్తోంది. అప్పుల ఊబి నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడం, పారదర్శకమైన పాలన అందించడం ద్వారా దేశానికే తెలంగాణను ఒక రోల్ మోడల్‌గా మార్చాలనే సంకల్పం కనిపిస్తోంది. గత పాలనలో జరిగిన అవినీతిని, కుటుంబ ప్రయోజనాలను పక్కన పెట్టి, కేవలం రెండు ఏళ్లలోనే ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ఎలా నడపాలో ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తోంది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాలం పోయి, ప్రజా క్షేమమే పరమావధిగా సాగే నవశకం ప్రారంభమైందని స్పష్టమవుతోంది.
