బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆంధ్ర బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు(Polavaram-Banakacharla Project)పై మాట్లాడుతూ ఆమె “ఆంధ్రోళ్ల బిర్యానీ (Andhra Biryani ) మనం తింటామా? ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పారు కదా?” అని వ్యాఖ్యానించడంతో, ఆంధ్రా ప్రజలు సహా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో వైసీపీ నేత రోజా ఇంటిలో ఆంధ్ర బిర్యానీ తిన్నప్పుడు ఎందుకు తిన్నారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సహా సామాన్య ప్రజలు ఈ వ్యాఖ్యను సంస్కారానికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
Akhanda Godavari Project : ‘ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’ అంటూ తడబడిన పురందేశ్వరి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సైతం తీవ్ర విమర్శలు చేస్తూ మాట్లాడుతూ.. “రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చిన ప్రభుత్వం వాటిని ఎక్కడ ఖర్చు పెట్టిందో శ్వేతపత్రం విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు. రేవంత్ తన ప్రియమైన సంస్థలకు ప్రాజెక్టులు అప్పగించినట్లు ఆరోపించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారని, మట్టి కూడా తీయకముందే కాంట్రాక్టర్లకు డబ్బులు వెళ్ళిపోయాయని విమర్శించారు. గతంలో కేసీఆర్ 10 ఏళ్లలో ఎలాంటి ప్రాజెక్టుకైనా ముందస్తు డబ్బులు ఇవ్వలేదని పేర్కొన్నారు. జూలై 6న హైదరాబాద్‌లో జరిగిన చంద్రబాబు-రేవంత్ రెడ్డి సమావేశం తరువాతే జూలై 15న పోలవరం-బనకచర్ల లింకేజీ ప్రాజెక్టు ప్రారంభమైందని తెలిపారు. ఇది కేవలం మెఘా సంస్థ కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, “రెవెన్యూ లేదు, పథకాలకి డబ్బులు లేవు, విద్యార్థులకు భోజనం లేదని ధర్నాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు వెళ్తున్నాయి,” అని మండిపడ్డారు. తెచ్చిన అప్పులపై ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.