Site icon HashtagU Telugu

Kavitha TRS: బీజేపీ ఆప‌రేష‌న్లో తెలంగాణ లేడీ షిండే

Kavitha

Kavitha

తెలంగాణ లేడీ షిండేగా బీజేపీ ఎవ‌ర్ని ఆవిష్క‌రించాల‌ని ప్ర‌య‌త్నం చేసిందో తెలిసిపోయింది. ఆ విష‌యాన్ని మీడియా ముఖంగా ఎమ్మెల్సీ క‌విత చెప్పేశారు. ఆమె మీద బీజేపీ ఆప‌రేష‌న్ చేసింద‌ని ఇటీవ‌ల సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయ‌న మాట‌ల‌కు కొన‌సాగింపుగా మీడియా వ‌ద్ద కొన్ని అంశాల‌ను క‌విత కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ప‌లువురు బీజేపీ నేత‌లు ట‌చ్ లోకి వ‌చ్చార‌ని ఆమె తెలిపారు. షిండేలాగా చూసుకుంటామ‌ని ఆఫ‌ర్ ఇచ్చార‌న్న విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్పారు. ఫ‌లితంగా గ‌త మూడు నెల‌లుగా ఏమి జ‌రిగిందో సూచాయ‌గా తెలిసిపోతోంది.

తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కుటుంబానికి అంత‌ర్గ‌తంగా పొస‌గ‌డంలేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు న‌మ్మ‌క‌స్తుడుగా ఉన్న ఎంపీ సంతోష్ మీద జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆయ‌న్ను దూరంగా కేసీఆర్ ఉంచార‌ని ఇంగ్లీషు వెబ్ సైట్లు, మీడియా ప్ర‌చారం చేసింది. ఆ క‌థ‌నాల‌ను ఆయ‌న ఖండించారు. ఇప్పుడు క‌విత మీడియా ముందుకొచ్చి బీజేపీతో ట‌చ్ లో ఉన్న‌ట్టు ప‌రోక్షంగా అంగీక‌రించారు. అంటే, ఏదో గూడుపుఠానీ జ‌రిగిందని అర్థం అవుతోంది. అంతేకాదు, కాంగ్రెస్ లోకి వెళ్ల‌డానికి ఆమె ప్ర‌య‌త్నించార‌ని మ‌రో గాసిప్ ను ఎంపీ అర‌వింద్ కుమార్ లేపారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో ఆమె ట‌చ్ లోకి వెళ్లార‌ని ఆయ‌న చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దానిపై క‌విత ప‌రోక్షంగా అంగీక‌రించిన‌ట్టు మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

Also Read:  TDP, BRS Alliance: `ఢిల్లీ` పై గేమ్‌? మోడీ పై తెలుగు పౌరుషం!!

యువ ఎంపీల‌ను మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ప్రోత్స‌హిస్తుంటార‌ని క‌విత చెప్పారు. రాజ‌కీయంగా చాలా మంది ప‌రిచ‌య‌స్తులు, స్నేహితులు ఉంటార‌ని, వాళ్ల‌లో ఒక‌రు ఖ‌ర్గే అంటూ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అంటే, ఫోన్లో ఆయ‌న‌తో మాట్లాడినట్టు అర‌వింద్ చేసిన ఆరోప‌ణకు ప‌రోక్షంగా క‌విత అనుకూలంగా మాట్లాడారన్న విష‌యాన్ని బీజేపీ లాజిక్ తీస్తోంది. ఆమె చుట్టూ ఇటీవ‌ల కాలంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ నుంచి కాసినో కింగ్ చిక్కోటి ప్ర‌వీణ్ ఎపిసోడ్ తిరుగుతున్నాయి. తాజాగా లైగ‌ర్ సినిమా నిర్మాణం సంద‌ర్భంగా జ‌రిగిన మ‌నీ ల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారం, తెలంగాణ లేడీ షిండే అంశం తెర మీద‌కు రావ‌డం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆమె ఫ్ర‌స్టేష‌న్లోకి వెళ్లిన‌ట్టు బీజేపీ భావిస్తోంది.

మీడియా ముందుకొచ్చిన క‌విత మునుపెన్న‌డూ లేని విధంగా మాట తూలారు. ఎంపీ ధ‌ర్మ‌పురి అరవింద్ మీద అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న్ను మెత్తిమెత్తి చంపుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ చౌర‌స్తాలో చెప్పుతో కొడ‌తానంటూ ఆమె స్థాయి దిగ‌జారి వ్యాఖ్యానించారు. అంతేకాదు, అదే స‌మ‌యంలో అర‌వింద్ ఇంటిలోకి జొర‌బ‌డి టీఆర్ఎస్ క్యాడ‌ర్ చేసిన ధ్వంసం భ‌యాన‌కంగా ఉంది. ఆ స‌మ‌యంలో ఇంటిలో ఉన్న మ‌హిళ‌లు భ‌య‌కంపితులు అయ్యారు. ఇలాంటి ప‌రిణామాలు తెలంగాణ రాజ‌కీయాల్లో చోటుచేసుకోవ‌డం దుర‌దృష్టం. ఇప్ప‌టి వ‌ర‌కు క‌విత చుట్టూ తిరిగిన ఈ ఎపిసోడ్లు భ‌విష్య‌త్ లో ఎటు వైపు దారితీస్తాయో చూడాలి.

Also Read:  AP, TS Elections: ఏపీ, తెలంగాణ‌ కు ఒకేసారి ఎన్నిక‌లు! `ముంద‌స్తు` కు జ‌గ‌న్‌?