MLC Kavitha: నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. బీఆర్‌ఎస్ లో తీవ్ర ఉత్కంఠ..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరుకానున్నారు. ముందుగా ఆమె మార్చి 16న హాజరు కావాల్సి ఉండగా.. బదులుగా తన లాయర్‌ను పంపింది.

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 10:00 AM IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరుకానున్నారు. ముందుగా ఆమె మార్చి 16న హాజరు కావాల్సి ఉండగా.. బదులుగా తన లాయర్‌ను పంపింది. దీంతో ఈడీ అధికారులు ఆమెకు మరోసారి నోటీసులు పంపారు. మార్చి 20న వ్యక్తిగతంగా హాజరుకావాలని.. నిన్న ఢిల్లీకి వచ్చిన కవిత ఈరోజు స్వయంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీఆర్‌ఎస్ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

నిన్న బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి కేటీఆర్, రాజీవ్ సాగర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, వావిరాజు రవిచంద్ర, తదితరులు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలో ఉన్నారు.

Also Read: YSRCP : సొంత‌పార్టీ నేత‌ల‌పై సీఎం జ‌గ‌న్ నిఘా..? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై అధికార పార్టీలో టెన్ష‌న్‌

ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. తమ కస్టడీలో ఉన్న పిళ్లైతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కవితలను విచారించాల్సి ఉందని ఈడీ ప్రత్యేక కోర్టుకు ఇది వరకే తెలిపింది. కానీ.. పిళ్లై వారం రోజుల పాటు కస్టడీలో ఉన్నా.. ఆ సమయంలో మాగుంట శ్రీనివాసులు, కవిత ఈడీ ముందుకు రాలేదు. అందుకే ఈరోజు కవిత, పిళ్లైలను కలిసి ప్రశ్నిస్తారో లేదో చూడాలి. నేడు పిళ్లైని ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఓ మహిళను తన కార్యాలయానికి పిలిపించి విచారించడం సరికాదంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 24న విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో కవితను ప్రశ్నించాలని ఈడీ కోరుతోంది. నిబంధనల ప్రకారం.. సీబీఐ విచారణలో ఎవరిని విచారించాలనుకుంటున్నారో వారిని ఎక్కడికి రావాలని సీబీఐ అడుగుతుంది. వారు చెప్పిన చోటే సీబీఐ అధికారులు వెళ్లి విచారిస్తారు. ED విషయంలో అలా కాదు. నిందితులు ఈడీ అధికారులు చెప్పిన ప్రదేశానికి వెళ్లి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళలకు మినహాయింపులు లేదు.