ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Case )లో అరెస్టై తీహార్ జైలు లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) బెయిల్ పిటిషన్ ఫై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు. కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ అంటుంది. మరి ఈ పిటిషన్ ఫై కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరు పరిచింది ఈడీ. కవితను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా, ఏడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా, మూడురోజులకు అనుమతించింది. చివరగా కవితను మార్చి 26న ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు.
We’re now on WhatsApp. Click to Join.
కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, మార్చి 26న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కవిత కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, ఆభరణాలు ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు కోర్టు అనుమతిచ్చింది. మరి ఈరోజు జరగనున్న బెయిల్ అంశం ఫై కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.
Read Also ; Ayodhya: రామయ్య భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఫ్లైట్!