ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్-04కు వాయిదా పడింది. ఏప్రిల్-04న మధ్యాహ్నం 2:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనున్నది. ప్రస్తుతం తీహార్ జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత .. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం కోర్ట్ ను ఆశ్రయించారు. అయితే కవితకు బెయిల్ ఇవ్వకూడదని.. ఆమె బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ పేర్కొంది. అయితే కవిత బెయిల్ పిటిషన్ పై విచారించిన కోర్టు.. మెరిట్ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 4వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఆ రోజు లంచ్ తర్వాత వాదలన వింటామని జడ్జి స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరు పరిచింది ఈడీ. కవితను 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా, ఏడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా, మూడురోజులకు అనుమతించింది. చివరగా కవితను మార్చి 26న ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, మార్చి 26న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కవిత కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, ఆభరణాలు ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు కోర్టు అనుమతిచ్చింది.
Read Also :9 Children Died : ల్యాండ్‌మైన్‌తో ఆడుకున్నారు.. పేలడంతో 9 మంది పిల్లల మృతి