Site icon HashtagU Telugu

Kavita with KTR for Delhi: ఢిల్లీకి కేటీఆర్ సమేత కవిత..

Kavita With Ktr For Delhi..

Kavita With Ktr For Delhi..

లిక్కర్ స్కాములో ఉన్న కవిత (Kavita) అరెస్ట్ వ్యవహారం దోబూచులాడుతుంది. ఢిల్లీ వెళ్లి పొలిటికల్ ఎపిసోడ్ ను రక్తి కట్టిస్తున్నారు. ఈడీ ఎదుట హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లిన కవిత గతంలో మాదిరిగా హైడ్రామా నడిపే ఛాన్స్ ఉందని టాక్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత సోమవారం ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలి. అందుకోసం సోదరుడు కేటీఆర్ తో కలిసి కవిత ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. వాళ్ల వెంట బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు.

సుప్రీం కోర్టులో కవిత (Kavita) వేసిన పిటిషన్ పై కేవియట్ వేసిన ఈడీ ఈ సారి ఆమెను కచ్చితంగా విచారిస్తారని తెలుస్తుంది. మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా, లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. స్కాములోని ప్రధాన నిందితులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. వాళ్ళతో కలిపి ముఖాముఖి విచారణ చేస్తారని తెలుస్తుంది. సోమవారం కూడా హైడ్రామా నడిపి జాతీయ స్థాయిలో బీ ఆర్ ఎస్ సత్తా చాటాలని పొలిటికల్ గేమ్ నడుస్తోంది. ఇలాంటి పరిణామాలు మధ్య నిందితురాలిగా కవితను వదిలేస్తారా? లేక అనుమానితురాలుగా భావించి వదిలేస్తారా? అనేది చూడాలి.

Also Read:  Jagan in Tirupur Sabha: నేనే హీరో.. వాళ్ళు విలన్లు! తిరువూరు సభలో జగన్