Site icon HashtagU Telugu

Kathi Karthika: నేను జగమొండి.. ఈసారి నన్ను ఎవరూ ఆపలేరు, రాహుల్ గాంధీ నా రోల్ మోడల్..!: క‌త్తి కార్తీక

Kathi Karthika

Katti

Kathi Karthika: ప్రముఖ రేడియో జాకీ, టీవీ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ క‌త్తి కార్తీక (Kathi Karthika) తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పారు. హ్యాష్ట్యాగ్ యూ  తో కత్తి కార్తీక పలు విషయాలను పంచుకున్నారు. ప్రజలకి మంచి చేయటమే తన లక్ష్యం అని ఆమె అన్నారు. క‌త్తి కార్తీక తన రాజకీయ భవిష్యత్తు ఆమె మాటల్లో.. “రాజకీయ నాయకురాలికి ఎమోషన్ ఉండాలి. ఎమోషన్ ఉంటేనే ఎదుటివాడి కష్టం అర్థం అయితది. పని చేయగలుగుతాం. ఎమోషన్ లేకుంటే ఎవరీ పని చేయలేం. ఎదుటివాడి బాధ అర్థం అయితేనే మనం వాళ్ళ కోసం పని చేస్తాం. పని చేయాలంటే పవర్ ఉండాలి. పవర్ ఏం చేయకుండా పైసలు ఇస్తే పవర్ రాదు. ప్రజలు మధ్యలో ఉండి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటే అప్పుడు మనకు ప్రజలు ఓటు వేస్తారు. నన్ను చాలా మంది ఎగతాళి చేశారు వాళ్ళకి బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలు నన్ను మనసులో పెట్టుకొని ఓటు వేసే వరకు నేను కష్టపడతా. నాకు జెండా, ఎజెండా రెండు ఉన్నాయ”న్నారు.

“నా లీడర్ రాహుల్ గాంధీ ఆయనతో కలిసి నేను యాత్రలో కూడా పాల్గొన్నాను. కన్యకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు నడవటం మాటలు కాదు. మహిళలకు ఎన్నో కష్టాలు ఉంటాయి. నెల నెల మస్తు కష్టాలు వస్తాయి. అటువంటిది ప్రతి ఒకరోజు 30 కిలోమీటర్లు 150 రోజులు అందరిని విడిచిపెట్టుకొని అది ఒక యజ్ఞం లెక్క చేసినం మేము నేను ఒకదాన్ని కాదు 30 మంది మహిళలు దేశ వ్యాప్తంగా నడిచారు. అలా నడవటం మాములు విషయం కాదు. అందరికి నేను సలాం కొడుతున్నా. అలాంటి మహిళలకు కొంచెం మర్యాద ఇవ్వాలి. నేను రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ఫాలో అవుతున్న అందుకే ప్రజలకు మంచి చేయాలనీ ప్రజల్లోనే ఉంటున్నా. నాకు కాంగ్రెస్ తరుపున టికెట్ వస్తదా లేదా అనేది సెకండరీ. నేను ఒక రేసుగుర్రాన్ని ఉరుకుతూనే ఉంటా”అన్నారు.

Also Read: Modi Cabinet : కేంద్ర మంత్రివ‌ర్గంలో `బండి` ప‌క్కా! జీవిఎల్ కు చిగురాశ‌!!

“నాకు ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ ప్రజల మధ్యలో ఉండే సాధిస్తా. నేను టికెట్ అవసరం లేదు అని చెప్పటంలేదు. ప్రజల మధ్యలో ఉంటే అధిష్టానమే గుర్తించి టికెట్ ఇస్తది. నా టార్గెట్ ఏంటంటే నేను ప్రజల మధ్యలో ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల గురించి ప్రజలకి చెప్పాలి. 24 గంటల్లో నేను 20 గంటలు ప్రజలతో’ఉండాలి అనుకుంటున్నా. రాహుల్ గాంధీ చెప్పారు ప్రజల్లో ఉండి పని చేసేవాళ్ళకి టికెట్ ఎక్కడకి పోదు అని, ఇంకా టికెట్ కోసం నాకేం బాధ. నాకు రాహుల్ గాంధీ ఐడియాలజీ నచ్చింది. నేను రాహుల్ గాంధీని దగ్గర ఉంది చూశా యాత్రలో. నేను కూడా రేపు రాహుల్ గాంధీలాగా తయారుకావాలని అనుకుంటున్నాను” అన్నారు.

“యాత్రలో మమల్ని మంచిగా పదును చేసి పంపించారు. కత్తి కార్తీక ఇప్పుడు చాలా పదును’అయిపోయింది. నన్ను ఆపే తరం ఎవరీ వాళ్ళ కాదు. నన్ను చాలామంది తుప్పు పట్టిన కత్తి అంటున్నారు. అందుకే చెప్తున్న నేను పదును ఉన్న కత్తిని అని. కత్తికి ఎక్కడైనా తుప్పు పడతాదా అలాగే కత్తి కార్తీకను ఎప్పుడు అయినా డీలా పడటం చూశారా..?నేను ఒక విజన్ తో ఉన్నా చాలా క్లారిటీతో ఉన్న నన్ను ఎవడూ ఆపేది లేదు. నేను మంచి చేస్తున్న చేడు చేస్తలేదు ప్రజలకి మంచి’చేయాలనీ చూస్తున్నా” అని పలు విషయాలు ప్రస్తావించారు.

Also Read: Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి మహిళా కమీషన్ నోటీసులు.. ఏపీలో పవన్ వ్యాఖ్యలపై రచ్చ..

కత్తి కార్తీక హైదరాబాద్ లోనే పుట్టింది పెరిగింది. పదవ తరగతి వరకు సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ ఉన్నత విద్యను చదివిన కార్తీక, లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్ లో మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, లండన్ లోనే ఆర్కిటెక్ గా రెండు సంవత్సరాలు పనిచేసింది. కార్తీక తొలుత రేడియో జాకీగా పని చేసింది. తరువాత ఓ ప్రముఖ ఛానల్ లో వ్యాఖ్యాతగా చేరి మంచి పేరు సంపాదించుకుంది.

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు కత్తి కార్తీక. దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీకకు 636ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. సోలిపేల రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా చివరి నిమిషంలో టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రభావం చూపలేకపోయారు.

Exit mobile version