Gnaneswar Swearing: తొలిరోజే `జ్ఞానేశ్వ‌ర్` స్వ‌రాలు తారుమారు

హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ చాలా కాలం త‌రువాత క‌ళ‌క‌ళ‌లాడింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్య‌క్షుడిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా చేప‌ట్టారు. ఆ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కు త‌ర‌లి వ‌చ్చిన జ‌నాన్ని గ‌మ‌నిస్తే, మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌స్తుందా? అనే ఆశ టీడీపీ వ‌ర్గాల్లో బ‌య‌లు దేరింది.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 11:41 AM IST

హైద‌రాబాద్ లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ చాలా కాలం త‌రువాత క‌ళ‌క‌ళ‌లాడింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్య‌క్షుడిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా చేప‌ట్టారు. ఆ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ కు త‌ర‌లి వ‌చ్చిన జ‌నాన్ని గ‌మ‌నిస్తే, మ‌ళ్లీ పూర్వ వైభ‌వం వ‌స్తుందా? అనే ఆశ టీడీపీ వ‌ర్గాల్లో బ‌య‌లు దేరింది.

ముహూర్తం ప్ర‌కారం అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను కాసాని చేప‌ట్టారు. ఆ సంద‌ర్భంగా టీడీపీ పాటల‌తో చేసిన భారీ ర్యాలీ ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ, స‌ర్ణాంధ్ర సార‌థి చంద్ర‌బాబు అంటూ పాడిన పాట తెలంగాణ టీడీపీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ్ఞానేశ్వ‌ర్ కు ఏ మాత్రం సూటు కాలేదు. స‌ర్ణాంధ్ర కోసం జ్ఞానేశ్వ‌ర్ పార్టీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన విధంగా ర్యాలీలోని పాట‌లు వినిపించ‌డం స‌మ‌న్వ‌య లోపాన్ని చూపిస్తోంది.

Also Read:  Tamilisai and Sabitha: రండి.. చర్చించండి, సబితకు తమిళిసై అపాయింట్ మెంట్!

సంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు రాజ‌కీయ పార్టీల‌కు ఆయువు. వాటి ద్వారా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించ‌డంతో పాటు ఆలోచింప చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అలాంటి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షించాలి. ఆ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుంటారు. ఎందుకంటే, మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో స్వ‌యంగా కేసీఆర్ రాసిన పాట‌ను ట్యూన్ చేసి ఓట‌ర్లను ఆలోచింప చేసి విజ‌యం సాధించారు. అంతేకాదు, ఉద్య‌మ స‌మ‌యంలోనూ ఆయ‌న స్వ‌యంగా చాలా పాట‌లు రాసి ప్ర‌జ‌ల్ని చైత‌న్య వంతం చేసి స‌క్సెస్ అయ్యారు.

ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌గా ఎంపిక చేసిన పాట‌ల‌ను జ‌నం మ‌ధ్య‌కు టీడీపీ తీసుకెళుతుంది. అలాగే, ఆయ‌న చేసిన మీకోసం, వ‌స్తున్నా..మీకోసం యాత్ర‌ల సంద‌ర్భంగా ప్ర‌త్యేక లిరిక్స్ తో రాసిన పాట‌ల‌ను ట్యూన్ చేయించారు. ఆ విధంగా జ్ఞానేశ్వ‌ర్ చేయ‌లేక‌పోయారు. తెలంగాణ టీడీపీ బాధ్య‌త‌ల‌ను తీసుకుంటోన్న ఆయ‌న సంద‌ర్భానుసారంగా పాట‌ల‌ను వినిపించ‌డంలో విఫలం అయ్యారు. స‌ర్ణాంధ్ర సార‌థి చంద్ర‌బాబు అంటూ పాడిన పాట జ్ఞానేశ్వ‌ర్ ర్యాలీలో వినిపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Watch :

Also Read:  Delhi Liquor Scam: ఏం విజ‌య్, `హౌ డూ ఐ..`