Kasani Gnaneshwar : కాసానిని గెలిపించుకుంటాం అంటున్న చేవెళ్ల ప్రజలు

తామంతా ఆయన ఏ పార్టీ లో ఉన్నారా..అనేది చూడడం లేదని..ఆయన మాకు చేసిన సేవ ను గుర్తు పెట్టుకొని ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని...మా మద్దతు ఆయనకే అని గట్టిగా చెపుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Kasani

Kasani

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (Kasani Gnaneshwar Mudiraj) ఈయన గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, శాసనమండలి సభ్యుడిగా పని చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కాసాని.. 2022 అక్టోబర్ 14న హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ ()TDP పార్టీలో చేరాడు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా 2022 నవంబర్ 04న నియమితుడయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకోవడంతో మనస్థాపంతో చెందిన ఆయన టీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌ (BRS) పార్టీలో చేరాడు. ప్రస్తుతం చేవెళ్ల లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. చేవెళ్ల (Chevella) లో కాసాని కి ఎంతో మంచి పేరు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన ఎన్నో సామాజిక సేవలు చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చారు. అక్కడి ప్రజలు కాసాని ని ఎంతగానో గౌరవిస్తుంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్న కాసాని వారికీ సాయం చేస్తూ వారి కుటుంబాల్లో ఓ వెలుగు నింపారు. అందుకే కాసాని అంటే వారికీ ఎంతో గౌరవం. అలాంటి వ్యక్తి ఇప్పుడు లోక్ సభ ఎన్నికల బరిలో నిల్చోవడం..అది కూడా చేవెళ్ల నుండి బరిలోకి దిగుతుండడం తో ఇక్కడ ప్రజలు ఆయనను గెలిపించుకుంటాం అని చెపుతున్నారు. తామంతా ఆయన ఏ పార్టీ లో ఉన్నారా..అనేది చూడడం లేదని..ఆయన మాకు చేసిన సేవ ను గుర్తు పెట్టుకొని ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని…మా మద్దతు ఆయనకే అని గట్టిగా చెపుతున్నారు. దీంతో చేవెళ్ల లో విజయం కాసాని దే అని అంత అంటున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో.

Read Also : 7 KG Gold Ramayana : 7 కేజీల బంగారంతో ‘రామాయణ’ గ్రంథం.. అయోధ్య రామయ్యకు కానుక

  Last Updated: 10 Apr 2024, 11:16 AM IST