Site icon HashtagU Telugu

T Congress : తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాట‌క లీడ‌ర్ల ఫోక‌స్‌.. సీఎల్పీ నేత పాద‌యాత్ర‌పై క‌ర్ణాట‌క సీఎం ఆరా.. !

Congress Hashtag

Congress Hashtag

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నిక‌ల హాడావిడి మొద‌లైంది. కర్ణాట‌కలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ‌లో నేత‌ల‌కు ఆశ‌లు చిగురించాయి. రెండు సార్లు అధికారం చేప‌ట్టిన బీఆర్ఎస్ పార్టీపై గ్రౌండ్ లెవ‌ల్‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఈ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ . టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క నిరంత‌రం జ‌నంలో ఉంటూ పార్టీని బ‌లోపేతం చేస్తున్నారు. తాజాగా భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావటం..రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి యాత్ర తో తెలంగాణ కాంగ్రెస్ క్యాడ‌ర్లో జోష్ పెరిగింది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తెలంగాణలో భట్టి యాత్ర పైన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆరా తీసారు. భట్టి పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో కాంగ్రెస్ నాయకత్వం ప్రశంసిస్తోంది. రాహుల్ ను ప్రధానిగా చేయటం ఈ సారి దక్షిణాది రాష్ట్రాలు కీలక భూమిక పోషించనున్నాయి. అందునా తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుంది. ఆ దిశగా భట్టి తన పాదయాత్రలో వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. పదేళ్ల కేసీఆర్ స‌ర్కార్ పాల‌న‌పై విసుగెత్తిన జ‌నం ఈ సారి మార్పును కోరుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అక్కడ బీజేపీ.. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరరకు జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ స్పూర్తి తో తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారు. మార్చి 16న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ప్రారంభమైన భట్టి యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. అనారోగ్య సమస్యలు వచ్చినా..యాత్ర కొనసాగింపులో వెనుకడుగు వేయలేదు. పార్టీ ప్రముఖులు..సీనియర్లు..కేడర్ భట్టి యాత్రకు అండగా నిలిచింది. తెలంగాణలో పార్టీ కోసం భట్టి చేస్తున్న పాదయాత్ర పైన స్వయంగా రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ థాక్రే నుంచి ఆరా తీసారు. భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలంగాణలో భట్టి పాదయాత్రకు వస్తున్న ఆదరణ పైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను వివరాలు కోరారు. సిద్దరామయ్య ఆదేశాలతో డీకే తెలంగాణలో భట్టి పాదయాత్ర గురించి ఆరా తీసారు. పాదయాత్రలో భాగంగా గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లతో భట్టి మమేకమవుతున్న తీరు.. వస్తున్న స్పందన బాగుందని సర్వే సంస్థలు డీకేకు..పార్టీ అధినాయకత్వానికి నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పాద‌యాత్ర‌లో 500 వందలకు పైగా గ్రామాలు.. తండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు కవర్ అయ్యాయి.వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చటం లక్ష్యంగా ఈ పాద‌యాత్ర ముందుకు కొనసాగుతోందని డీకే సేకరించిన సమాచారంలో వెల్లడైనట్లు తెలుస్తోంది