Site icon HashtagU Telugu

Karimnagar Leaders: కరీంనగర్ లీడర్లే.. స్టార్స్ క్యాంపెనర్స్!

Kareemnagar

Kareemnagar

ఏడాది క్రితం కరీంనగర్ పరిధిలోని హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల జిల్లాకు చెందిన ముఖ్య నేతలు మునుగోడులో మకాం వేసి ఉపఎన్నికను ఆసక్తికరంగా మార్చారు. అయితే ఎక్కువగా కరీంనగర్ జిల్లాలకు చెందిన నాయకులే స్టార్స్ క్యాంపెనర్స్ గా వ్యవహరిస్తుండటం రాజకీయాకంగా హాట్ టాపిక్ గా మారింది.

కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన త్వరలో మునుగోడులో తనదైన ముద్ర వేయబోతున్నారు. జిల్లాకు చెందిన మరో కీలక నేత వివేక్ ఆధ్వర్యంలో మునుగోడులో సమన్వయ కమిటీ కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు ఆయా గ్రామాల ప్రచార బాధ్యతలు అప్పగించేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గత కొన్ని రోజులుగా బీజేపీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. పార్టీ రాజకీయ జాయినింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా స్థానిక నేతలతో సమావేశమవుతున్నారు.

Also Read:   KTR on Modi: మోడీకి అస్కార్ కాకపోయినా, భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే!

కాగా చౌటుప్పల్‌-1 ఎంపీటీసీ ఏరియా బాధ్యతలను కేటీఆర్‌ తీసుకోగా, చండూరు మండలంలోని నారాయణపూర్‌-2 ఎంపీటీసీ పరిధి, బోడగింపర్తి, తస్కాని గూడెం, సిద్దేపల్లి గ్రామాల బాధ్యతలను మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌లకు అప్పగించారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కె చందర్, రసమయి బాలకిషన్, డాక్టర్ సంజయ్ కుమార్, కె విద్యాసాగర్ రావు, వొడితెల సతీష్ కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావుతో పాటు ఇతర నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇప్పటికే మునుగోడులో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబు గత కొన్ని రోజులుగా మర్రిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మర్రిగూడెం మండల ప్రచార బాధ్యతలను జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మునుగోడు మండల బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.

Also Read:   Pawan Kalyan Warns: మూడు పెళ్లిళ్లు మీరూ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు?