Site icon HashtagU Telugu

Telangana: కరీంనగర్‌ కలెక్టర్‌గా పమేలా సత్పతి.. సీపీగా అభిషేక్‌ మహంతి

Hyderabad (29)

Hyderabad (29)

Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఈ క్రమంలో భారీగా బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మరో ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

మున్సిపల్‌ అడ్మినిస్టేషన్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న పమేలా సత్పతిని కరీంనగర్‌ కలెక్టర్‌గా, రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీగా ఉన్న అభిషేక్‌ మహంతిని కరీంనగర్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి.గోపి, కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బా రాయుడు శుక్రవారం బదిలీ అయిన సంగతి తెలిసిందే.

పమేలా సత్పతి 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఈమె గతంలో భద్రాచలం జిల్లా సబ్‌ కలెక్టర్‌గా, వరంగల్ క‌మిష‌న‌ర్‌గా, యాదాద్రి కలెక్టర్‌గాను పని చేశారు. అభిషేక్‌ మహంతి 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్‌-1 డీసీపీగా కొనసాగారు.

Also Read: Chandrababu : చంద్రబాబు కు బెయిల్ రావడం తో సంబరాల్లో టీడీపీ శ్రేణులు

Exit mobile version