Site icon HashtagU Telugu

Vinod Kumar : కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయమన్నారు.. ఆధారాలున్నాయ్ : వినోద్ కుమార్

Brs Ex Mp Vinod Kumar Comme

Vinod Kumar : బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి  వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయిందని..  కావాలంటే కరీంనగర్‌కు వచ్చి అడగాలని ఆయన సూచించారు. ‘‘2019 సంవత్సరంలో  కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ లోక్‌సభ స్థానంలో  డిపాజిట్ రాలేదు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు  డిపాజిట్ రాదు’’ అని వినోద్ (Vinod Kumar) వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులే బీజేపీకి ఓటు వెయ్యమని చెప్పారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ అయోధ్య రామమందిరాన్ని కూల్చే దమ్ము ఎవరికైనా ఉంటుందా ? ఓడిపోతున్నామని తెలిసే ప్రధాని మోడీ రామమందిరంపై అలాంటి మాట్లాడుతున్నారు. విపక్షాలు గెలిస్తే ఏదో జరిగిపోతుందని ప్రజలను భయాందోళనలకు గురి చేేసేందుకు మోడీ యత్నిస్తున్నారు’’ అని  వినోద్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ట్రెండ్స్ గురించి తాజా సమాచారాన్ని తెలుసుకున్న ప్రధాని మోడీ ప్రస్తుతం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని.. అందువల్లే ఆయన ప్రజలను ప్రభావితులను చేసేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ‘‘ఒకవేళ దేశంలో బీజేపీకి 272 సీట్లు రాకపోతే.. ఆ పార్టీ నాయకులంతా కలిసి మోడీని ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండా ఆపేస్తారు’’ అని వినోద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read :Deve Gowda : నేరం రుజువైతే నా మనవడిపై చర్యలు తీసుకోవాల్సిందే : దేవెగౌడ

‘‘సాయంత్రం జ‌రిగే తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో రైతుబంధు ప‌థ‌కం గురించి చ‌ర్చించాలి. పీఎం కిసాన్ ప‌థ‌కానికి స్ఫూర్తి రైతుబంధు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు రైతు భ‌రోసా అమ‌లు కాలేదు. రైతుభ‌రోసా అమ‌లు చేసి ఎక‌రాకు రూ. 15 వేలు ఇవ్వాలి. రైతుల ప‌ట్ల సానుకూల నిర్ణ‌యం తీసుకోవాలి’’ అని వినోద్ కుమార్ కోరారు.  వ‌రి పండించిన రైతుల‌కు రూ. 500 బోన‌స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలకు బోన‌స్, మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో రేవంత్ రెడ్డి మాట త‌ప్పారని ఆయన పేర్కొన్నారు.  ‘‘వ‌రి ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాలి. రైతుల క్వింటాల్ ధాన్యం రూ. 1800కే అమ్ముకుంటున్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు ధాన్యం కొనాలి’’ అని వినోద్ కుమార్ తెలిపారు.

Also Read : Sai Dhansika : ముద్దు సీన్లు, బెడ్ రూమ్ రొమాన్స్.. అవి చేయకుండా రాణించాలంటే..?