Site icon HashtagU Telugu

KTR: గులాబీ సభ సక్సెస్.. కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు : కేటీఆర్

Ktr Palrament

Ktr Palrament

KTR: ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో కదనభేరి సభను నిర్వహించిన విషయం తెలిసిందే. కేసీఆర్ హాజరైన ఈ సభకు లక్షలాది మంది జనం పాల్గొన్నారు. ఊహించని విధంగా సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ లో జోష్ కనిపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కరీంనగర్ కదనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అశేషంగా తరలివచ్చిన ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

నాడు అయినా.. నేడు అయినా.. ఏనాడైనా.. కరీంనగర్ గడ్డ.. గులాబీ అడ్డ అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని, కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలుపు ఖాయమని ఈ సభతో తేలిపోయిందన్నారు. గులాబీ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపిల గుండెల్లో గుబులు మొదలైందని కేటీఆర్ అన్నారు.

కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు.