Kanti Velugu at Assembly: అసెంబ్లీలో ‘కంటి వెలుగు’.. ఎమ్మెల్యేలకు పరీక్షలు!

కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది.

  • Written By:
  • Updated On - February 8, 2023 / 02:56 PM IST

కంటి వెలుగు.. తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది. ఈ పథకానికి ఊహించనివిధంగా రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలోనూ కంటి వెలుగు కార్యక్రమం జరిగింది.

అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటివెలుగు స్టాల్ ల వద్దకు ఎంఐఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్ లను స్వయంగా హరీశ్ రావు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కంటివెలుగు ప్రాముఖ్యతను వివరించారు. కంటి వెలుగు కార్యక్రమం అద్భుతంగా ఉంది ఎం ఐ ఎం శాసన సభ్యులు అన్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ది కలిగించే అవకాశం ఉందని ఏంఐఎం ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసన సభ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమంను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ ను, మంత్రి హరీష్ రావులను ఎమ్మెల్యేలు అభినందించారు.