Site icon HashtagU Telugu

Allu Arjun : కాంగ్రెస్ విజయం కోసం రంగంలోకి అల్లు అర్జున్ ..?

Bunny Cng

Bunny Cng

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పుష్ప (Pushpa) మూవీ తో ఓ రేంజ్ కి వెళ్ళాడు. పుష్ప ముందు వరకు వేరే పుష్ప తర్వాత వేరు అనేలా ఆయన క్రేజ్ పెరిగింది. అలాంటి బన్నీ కోసం ఎంతోమంది , ఎన్నో సంస్థలు, ఎన్నో పార్టీలు ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి మా యాడ్ లో కనిపించమని అడిగేవారు..మా పార్టీ కి సపోర్ట్ చెయ్యండి అని పిలిచే వారు..ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా బన్నీ ని వాడుకునేందుకు చూస్తున్నారు. అలాంటి బన్నీ..త్వరలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేస్తారా..? ఇప్పుడు తెలంగాణ (Telangana) లో ఇదే చర్చ నడుస్తుంది. దీనికి కారణం ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడమే.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే బిఆర్ఎస్ నుండి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరి టికెట్ సాధించుకొని విజయం సాధించారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి బిఆర్ఎస్ నేతలు ఆ పార్టీ నుండి బయటకు వస్తూ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక ఈరోజు పెద్ద ఎత్తున మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , జడ్పీ చెర్మన్ లు ఇలా అనేక మంది కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఒకరు.

పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ (Malkajgiri MP Ticket) స్థానం నుండి పోటీ చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrasekhar Reddy) భావిస్తున్నారట. 2014 కంటే ముందు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తాను విద్యాభ్యాసం చేసే సమయంలో కాంగ్రెస్ యూత్ విభాగంలో పనిచేసినట్లు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉందని చెప్పారు. కంచర్ల చేరిక తమకు కూడా ఫ్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో అల్లుడు అల్లు అర్జున్ సినీ గ్లామర్‌ను ఉపయోగించుకోవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ తరపున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికలకు దూరంగా ఉండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యారు. ఆయన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటంతో పాటు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అయితే అక్కడ సిట్టింగ్‌కే అవకాశం ఇవ్వటంతో కంచర్లకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. సో మామ గెలుపు కోసం పుష్ప ప్రచారం చేస్తారనే అంత భావిస్తున్నారు. చూద్దాం బన్నీ రంగంలోకి దిగుతాడా..లేడా..? అనేది.

Read Also : TDP-JSP : లిస్ట్‌ విడుదలలో జాప్యం.. టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల్లో కలవరం