Site icon HashtagU Telugu

Kancharla Chandrasekhar Reddy : అవసరమైతే పుష్ప ను రంగంలోకి దింపుతా అంటున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

Kancharla Chandrasekhar Red

Kancharla Chandrasekhar Red

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎంత దూకుడు మీద ఉందో చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది లేదు అని అన్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరి..కాంగ్రెస్ టికెట్ కోసం కసరత్తలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలుకావడం తో..అధికార పార్టీ లోకి భారీ ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రులు , కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకోగా..మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సై అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో అల్లు అర్జున్ మామ , కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (Kancharla Chandrasekhar Reddy) ఓ మీడియా ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తనకు మల్కాజ్‌గిరి లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చిన పర్వాలేదని… ఆ సమయంలో అవసరమైతే అల్లు అర్జున్ (Allu Arjun) తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అదే సమయంలో అల్లు అర్జున్ సహా తన కుటుంబం తనకు మద్దతుగా ఉంటుందన్నారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారన్నారు. ఆ సమయంలో (టిక్కెట్ ఇచ్చాక) పరిస్థితిని బట్టి అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చే అవకాశముంటుందన్నారు. అయినప్పటికీ ఈ రోజు ఎవరు వచ్చినా… ఎవరు రాకపోయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. భువనగిరిలో ఏ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని .. తనకు భువనగిరి టిక్కెట్ ఇస్తే కోమటిరెడ్డి సోదరుల సహకారం తనకు ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు చంద్రశేఖర్. మరి ఈయన చెప్పినట్లు మామ కోసం బన్నీ వస్తాడా…? అనేది చూడాలి.

Read Also  : Nara Lokesh Convoy : నారా లోకేష్ కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు..