TG High Court : తెలంగాణ హైకోర్టు నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై విచారణను వాయిదా వేసింది. ఈ భూములపై వట ఫౌండేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్‌సీయూ) విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో ఏప్రిల్ 2న వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న ధర్మాసనం.. ఒక్కరోజు పనులు ఆపాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను నేటికి వాయిదా వేసింది. దీంతో ఈరోజు మరోసారి విచారణ చేపట్టింది.
Read Also: Parimatch : పారిమ్యాచ్ కొత్త గేమ్‌లో కేంద్ర బిందువుగా సునీల్ నరైన్
ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు న్యాయస్థానాన్ని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) గడువు కోరారు. ఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి మూల కారణాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ భూమిగా గుర్తించబడ్డ ఈ స్థలంపై వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతులు మంజూరయ్యాయా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. అలాగే.. ఈ భూములు నిజంగా ప్రభుత్వానికి చెందుతాయా, లేక ప్రైవేట్ సంస్థలకు చెందినవా..? అనే విషయంలో స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది.
Read Also: Cabinet Expansion: సోనియాతో భేటీ.. మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన