కామారెడ్డిలో విషాదం నెలకొంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మృతుల్లో భార్యభర్తలతోపాటు ఇద్దరు పిల్లలున్నారు.
స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం… జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందని హైమద్ 35, పర్వీన్ 30, అద్నాన్ 4 మహిమ్ 6 విద్యుత్ షాక్ తో మరణించారు. ఇంట్లో మొదట పిల్లలకు విద్యుత్ వైర్ తగలడంతో వారిని రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రలిద్దరూ కరెంట్ షాక్ కు గురయ్యారు. మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.