Site icon HashtagU Telugu

Kamareddy Bandh: కదంతొక్కిన రైతులు.. కామారెడ్డి బంద్!

Kamareddy

Kamareddy

రైతు నిరసనలో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి (Kamareddy) జిల్లాలో శుక్రవారం దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు బంద్ అయ్యాయి. కామారెడ్డి (Kamareddy)పట్టణానికి సంబంధించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తమ వ్యవసాయ భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ స్థానిక రైతులు (Formers) నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కామారెడ్డి పట్టణ బంద్ కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపును ఇచ్చింది.

ఈ బంద్ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసి రైతులకు మద్దతు ప్రకటించాయి. అయితే.. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. బంద్ ను రైతులు – పోలీసులు చాలెంజ్ గా తీసుకున్నారు. కామారెడ్డి (Kamareddy) టౌన్  బంద్ కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపు ఇవ్వడంతో రైతులను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు.

ఎలాంటి సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు (Police) భారీగా మోహరించారు. కామారెడ్డి టౌన్ లోకి వచ్చే రోడ్ ల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి రైతులను అదుపులోకి తీసుకుంటున్నారు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ తో ఇచ్చిన పట్టణ బంద్ కు బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ జన సమితితో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. బంద్ ను విచ్చిన్నం చేయడానికి పోలీసులు ముందు జాగ్రత్తగా పొలిటికల్ లీడర్ (Political Leaders) లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ, బండి సంజయ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతులకు మద్దతుగా ఆందోళన చేసిన పలువురి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Chandrababu warns Jagan: కుప్పంలో హైటెన్షన్.. జగన్ పై చంద్రబాబు ఫైర్!