Bandi Sanjay : తెలంగాణ రాజకీయాలలో మరోసారి కలకలం రేపుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసు పూర్తిగా ఒక కుటుంబ నాటకం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పుడు కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ పేరుతో ఓ సినీ నాటకమే నడుస్తోంది. ఇందులో ప్రతిఒక్కరూ పాత్రధారులే. కాని ప్రజల కోసం నిజంగా కృషి చేసే పాత్ర ఎవ్వరికీ లేదు అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న రాజకీయం గురించి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్‌గా మారిపోయింది. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు, కేసును తిప్పిచెప్పేందుకు, మా పార్టీతో కలవాలని ప్రయత్నించారు. కానీ బీజేపీ అవినీతిని ఏమాత్రం సహించదు. బీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పుడూ కలవదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాత్రమే కలిసి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు.
Read Also:Harish Rao : పీసీసీ అధ్యక్షుడి స్థాయికి తగినట్టు వ్యవహరించాలి: హరీశ్ రావు
వేములవాడలోని రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడంపై బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరం. గోశాలలో తగిన రీతిలో సంరక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. త్వరలోనే ఈవోతో మాట్లాడి, కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించే విధానంపై చర్చిస్తాను అన్నారు. గోశాలల్లో మూగజీవాల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని హితవు పలికారు. రాజన్న ఆలయానికి సంబంధించిన నిధులను గతంలో మాజీ సీఎం వేరే అవసరాల కోసం వినియోగించారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఆలయం రాష్ట్ర ఆస్తి మాత్రమే కాదు, ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఈ నిధులు పక్కదారి పడటం నైతికంగా తప్పు. దీనిపై విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు.
మన సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. పాక్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోడీ చెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు యుద్ధం కొనసాగుతుంది అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను బండి సంజయ్ కేంద్రంగా విమర్శిస్తూ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కూటమిపై తీవ్రంగా దాడి చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.
Read Also: Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్