Site icon HashtagU Telugu

Kavitha React on Budget: మోడీ బడ్జెట్ అంకెల గారడి: కల్వకుంట్ల కవిత

Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

తెలంగాణతో (Telangana) పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ (Budget) లో ఏమీ ఇవ్వలేదని చెప్పారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా తెలంగాణకు రాదని స్పష్టం చేశారు. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాంపును పొడిగించినప్పుడు మరి తెలంగాణ నిమ్జ్, ఇతర సెజ్ ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తున్నారని అడిగారు. ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని కవిత (MLC Kavitha) నిలదీశారు.

కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5300 కోట్లు కేటాయించినందుకు సంతోషమే కానీ తెలంగాణకు చెందిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కేటాయింపులేవని ఎమ్మెల్సీ (MLC Kavitha) ప్రశ్నించారు. నీతీ ఆయోగ్ సిఫారసు చేసిననప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో భవిష్యత్తుపై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాత పథకాలను విస్మరించడం వంటివి చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోందని స్పష్టం కల్వకుంట్ల కవిత చేశారు. దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధేశించని బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. బడ్జెట్ ను మోదీ (PM Modi) అంకెల గారడిగా అభివర్ణించారు. కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ కవిత చేశారు.

ఎయిర్పోర్టుల వంటి ప్రాజెక్టుకు ప్రకటించినా అవన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలకే మంజూరు చేస్తారని తెలిపారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని, గత 9 ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. ఏయే రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తరో జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలకు రూ. 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన కేంద్రం…వాటిని ఏ సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. కేవలం వారి కార్పొరేట్ మిత్రులకే వెళ్తాయా ఈ నిధులు అని అడిగారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేశారు.

Also Read: Union Budget : `మోడీ` మేడిపండు బ‌డ్జెట్‌, రూ. 45ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ లో రైతే లాస్ట్‌

Exit mobile version