Site icon HashtagU Telugu

Rajagopal Reddy: కల్వకుంట్ల కవిత జైలుకెళ్లడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy

Rajagopal Reddy

ఢిల్లీ (Delhi) లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసొడియో అరెస్ట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ అరెస్టులు ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జైలకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేత వివేక్ కవిత అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించగా, తాజాగా మరో నేత మాట్లాడారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లక తప్పదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) వ్యాఖ్యానించారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యవస్థ లేదని.. కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు కలిసి రావాలని (Rajagopal Reddy) పిలుపునిచ్చారు.

కవిత రియాక్షన్ ఇదే

అయితే ఈ విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తన పాత్ర ఉందని, తనను అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. నిజంగానే ఆ కేసులో తన పాత్రపై ఆధారు‍లుంటే అరెస్టు చేయాలని కవిత (MLC Kavitha) సవాల్ విసిరారు. బీజేపీ సర్కార్ పై కేసీఆర్ యుద్దం చేస్తున్నారు కాబట్టి ఆయనపై కక్ష తీర్చుకోవడానికి కేసీఆర్ కూతురునైన తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

Also Read: Dog Bite Cases: రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. రోజుకు 100 కేసులు!