Bhatti: టీఆర్ఎస్ స‌ర్కార్‌పై సీల్పీ నేత భట్టి ఫైర్‌!

కాళేశ్వ‌రంలో మునిగిన మోట‌ర్లు ప‌ని చేస్తాయా? లేదా? లిఫ్ట్ ప‌ని చేసే ప‌రిస్థితి ఉందా? ప్రాజెక్టు వ‌ద్ద‌కు చూడ‌టానికి వెళ్లిన

  • Written By:
  • Publish Date - August 1, 2022 / 04:58 PM IST

కాళేశ్వ‌రంలో మునిగిన మోట‌ర్లు ప‌ని చేస్తాయా? లేదా? లిఫ్ట్ ప‌ని చేసే ప‌రిస్థితి ఉందా? ప్రాజెక్టు వ‌ద్ద‌కు చూడ‌టానికి వెళ్లిన వారిని పోలీసుల‌తో ఎందుకు అడ్డుకుంటున్నారు? అందులో పని చేసే వర్కర్స్ ఫోన్ లు కూడా ఎందుకు తీసుకుపోనివ్వడం లేదు? అక్క‌డ దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఏంటీ? కాళేశ్వ‌రంలో ఏం జ‌రుగుతుంది? ప్ర‌జ‌లు చెప్ప‌కుండ దాయడం మంచిది కాదు. కాళేశ్వ‌రం సంద‌ర్శించ‌డానికి త్వ‌ర‌లో సీఎల్‌పి బృందం వెళ్తుంది. త‌మ‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని సీల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప‌ద్దెనిమిదిన్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌కు అద‌నంగా సాగు నీరు ఇవ్వ‌డానికి కాళేశ్వ‌రం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మిస్తున్నామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం 8 సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయాన్ని, సంపదను, చేసిన‌ అప్పుల మొత్తాన్ని కాళేశ్వరం లో దార‌పోసి ఒక్క ఎక‌రానికి కూడ సాగు నీరు ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు.

గోదావ‌రి వ‌ర‌ద‌ల‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టు మోట‌ర్లు మునిగి, ర‌క్ష‌ణ గోడ‌లు కూలి నేడు నిరుప‌యోగంగా మార‌డం వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల సంప‌దను ప్ర‌భుత్వం నీళ్ల పాలు చేసింద‌ని మండిప‌డ్డారు. మోట‌ర్లు మున‌గ‌డం, ర‌క్ష‌ణ గోడ‌లు కూల‌డం క‌చ్చితంగా ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గోదావ‌రి వ‌ర‌ద నీటిలో మునిగిపోయిన మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ళ పంపులు ఇక‌ పనిచేస్తాయా? లేదా? ఎంత మేర‌కు న‌ష్టం జ‌రిగింది? న‌ష్టానికి కార‌ణాలు ఏంట‌న్న‌దానిపై స‌మ‌గ్ర స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు వెంట‌నే చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల సుడిగుండంలో ఒక వైపు కొట్టుమిట్టాడుతుండ‌గా, మ‌రొక్క వైపు గోదావరి తీర ప్రాంత ప్రజలు వ‌ర‌ద ముంపున‌కు గురై ఆక‌లి కేక‌ల‌తో అల‌మ‌టిస్తుంటే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసి సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ అధికారుల‌ను వెంట‌బెట్టుకొని ఢిల్లీకి ఎందుకు వెళ్లార‌ని ప్ర‌శ్నించారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? ప‌రిపాల‌న సాగుతుందా? అని నిల‌దీశారు.

కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ కాలుకు గాయామై విశ్రాంతి కోస‌మని ఇంట్లో ఉన్నాడ‌ని, మిగ‌త మంత్రులు రాష్ట్రంలో మాట్లాడే ప‌రిస్థితిలో లేర‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవాల్సిన సీఎం కేసీఆర్ అధికార‌ల‌తో క‌లిసి ఢిల్లీలో ఉంటే రాష్ట్రంలో ప‌రిపాల‌న ఏం కావాల‌ని నిల‌దీశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కాకుండ సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని ఆగం చేయోద్ద‌న్నారు. వ‌ర‌ద ముంపుపై జ‌రిగిన పంట‌, ఆస్తి, ప్రాణ న‌ష్టాన్ని క్షేత్ర స్థాయిలో అంచ‌నా వేయించి వెంట‌నే కేంద్రానికి నివేదిక పంపాల‌న్నారు. అదే విధంగా జ‌రిగిన న‌ష్టానికి ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం కోసం కేంద్రం నుంచి ఎంత తెస్తారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎంత ఇస్తారో ప్ర‌క‌ట‌న చేసి ప్ర‌జ‌ల‌కు భ‌రో సా ఇవ్వాల‌ని కోరారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు మునక‌, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో జ‌రిగిన నష్టం, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డం కోసం వెంట‌నే ప్ర‌భుత్వం వ‌ర్ష‌కాల అసెంబ్లీ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శాసన సభ్యులు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటార‌ని, ఆయ‌న‌తో తాను, పార్టీ అదిష్టానం కూడా మాట్లాడుతుంద‌న్నారు. ఆయన కు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేసి, సాధ్యమైనంత వరకు రాజ‌గోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే ఉండేలా చూస్తామ‌ని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పారు.