Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్టు లోన్లు, డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులు, నిధుల సేకరణ వంటి అంశాలపై కమిషన్ రామకృష్ణ రావును ప్రశ్నించింది. కాళేశ్వరం కార్పొరేషన్ నిధులు ఎలా సమకూర్చింది? కార్పొరేషన్ ఆదాయాన్ని ఎలా అర్జించింది? డిజైన్ల నిబంధనలు పాటించారా? వంటి కీలక ప్రశ్నలకు సమాధానాలు కోరింది.
డిజైన్ల గురించి ప్రశ్నించగా, రామకృష్ణ రావు స్పందిస్తూ, “ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదే. కానీ డిజైన్లు అప్రూవల్ చేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించలేదు” అని వెల్లడించారు. ఈ విషయాన్ని కమిషన్ నిర్ధారించుతూ, ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు స్పష్టతనిచ్చింది.
England: భారత్‌తో తొలి టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించిన ఇంగ్లండ్!
కమిషన్ ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించినప్పటికీ, నిర్మాణంలో తగిన విధానాలను పాటించలేదని రికార్డులు చూపాయి. అసెంబ్లీలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫిజికల్ పాలసీ వివరాలు సమర్పించకపోవడం, ప్రాజెక్టు ఫైల్స్‌ను క్యాబినెట్ ముందు సరిగ్గా ప్రవేశపెట్టకపోవడం వంటి అంశాలను కమిషన్ ప్రస్తావించింది. అంతేకాకుండా, నిధుల విడుదలలో బిజినెస్ రూల్స్ పాటించలేదని పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్న రుణాలపై రామకృష్ణ రావు వివరణ ఇచ్చారు. “ప్రాజెక్టు కోసం 9 నుండి 10.5 శాతం వడ్డీతో రుణాలను రీపేమెంట్ చేస్తున్నాం. ఈ ఏడాది ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలో రూ.7382 కోట్లు చెల్లించాం. అలాగే వడ్డీ రూపంలో రూ.6519 కోట్లు చెల్లించాం” అని ఆయన తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని పేర్కొన్నారు.
కమిషన్ ప్రశ్నించినప్పుడు రామకృష్ణ రావు సమాధానమిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పరిశ్రమలకు విక్రయించడం ద్వారా రూ.7 కోట్ల ఆదాయాన్ని అర్జించగలిగాం. అయితే ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన విషయం తెలిసిందే” అని వివరించారు.
కమిషన్ ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణంలో కోర్ కమిటీ రికార్డులు లేవని, నిధుల విడుదల విషయంలో సరైన ఆర్థిక నియమాలను పాటించలేదని తెలిపింది. రామకృష్ణ రావు సమాధానాలను పరిశీలించిన తర్వాత, ప్రాజెక్టు అమలు, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, డిజైన్ల ఆమోదం వంటి అంశాల్లో పునరాలోచన అవసరమని సూచించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం ఎలా ఆదాయాన్ని పెంచగలదో అనే అంశంపై రామకృష్ణ రావు ప్రాథమిక ప్రణాళికను వివరించారు. పరిశ్రమలకు నీటి సరఫరా, త్రాగునీటి వ్యాపారంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం రాబడే అవకాశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు నిర్వహణ, ఆర్థిక సమన్వయం, నిబంధనలపై మరింత జాగ్రత్తలు అవసరమని కమిషన్ తన సమీక్షలో వెల్లడించింది.
Hydra Police Station : ఇదిగో హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్