తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. కన్నెపల్లి పంపు హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు నాట్లు వేయలేని పరిస్థితి వచ్చిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత వరి సాగుకు నీరు అత్యవసరమని, ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Useful Tips: ధోనీ లాగా కూల్‌గా ఎలా ఉండాలి? జీవితంలో ఎంతగానో ఉపయోగపడే చిట్కాలివే!
మేడిగడ్డ అనేది పూర్తిగా వేరు, ప్రస్తుతం మేడిగడ్డ డ్యామ్ పని చేయకపోయినా, కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని తేలిగ్గా ఎత్తిపారించవచ్చని సూచించారు. అయినప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉండటం దారుణమని, దీని వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆయన ఆరోపించారు. నీళ్లిచ్చే విషయంలో లేవనెత్తే సాంకేతిక సమస్యలు, విచారణలు అన్నీ కేవలం రైతులను మోసం చేయడానికే ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
Ponnam Prabhakar : రామచందర్ లేఖపై మంత్రి పొన్నం ఫైర్
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తాము కాళేశ్వరం వద్ద మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు “మీరు ఆన్ చేస్తారా..? లేక మేమే చేయాలా..?” అంటూ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో లక్ష మంది రైతులతో కలిసి కన్నెపల్లి వద్దకు వెళ్లి మోటార్లు ఆన్ చేసే కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. రైతుల పక్షాన నిలవాలని హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.