Site icon HashtagU Telugu

Prof Kodandaram: కాళేశ్వరం వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి: టీజేఎస్ చీఫ్ కోదండరాం

Kaleshwaram

Kaleshwaram

Prof Kodandaram: తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ” కుంగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ లకు పరిష్కార మార్గాలు ఏమిటి?” అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశానికి టీజేఎస్ ఛీఫ్ కోదండరాం హాజరై మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు అటు ప్రజల్లో, ఇటు రాజకీయ పార్టీల్లో ఎన్నో అనుమానాలున్నాయని, ఆ వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని, లేదంటే లేదంటే మేమే బయటపెడతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టు సాక్ష్యమని,  గిన్నీస్ రికార్డు కోసమే కట్టారని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ రిపోర్ట్ బయట పెట్టాలని, ప్రాజెక్టు అధ్భుతాలపై రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగల్భాలు ఆపాలని ఆయన అన్నారు.  శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల ప్రాజెక్టులు ధృడంగా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది.? అధికార దుర్వినియోగం కారణంగా కనిపిస్తోందని,  కాళేశ్వరం ప్రాజెక్టు పై సమగ్ర దర్యాప్తు జరగాలి. కోదండరాం డిమాండ్ చేశారు. అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. నదిపై స్టడీ చేయకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం సరికాదని,  రిటైర్డ్ ఇంజినీర్లపై ఆధారపడి కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడంపై ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నర్సింహారావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ  మేడిగడ్డ చాలా క్రిటికల్ ప్రాజెక్టు అని,  బ్యారేజ్ లు 5 టీఎంసీల వరకే నిర్మిస్తారు. డెల్టా ప్రాంతంలోనే వీటిని కడతారని,  కాళేశ్వరంలో డిజైన్ డైవర్షన్ మెంట్ లేదని ఆయన మండిపడ్డారు.

ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు విజయసారథి రెడ్డి, రిటైర్స్ ఇంజనీర్స్ రంగారెడ్డి, రఘుమారెడ్డి, శ్యాం ప్రసాద్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, దేశాయ్ రెడ్డి, సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు, అధ్యయన వేదిక అధ్యక్షుడు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాధిక్, ట్రెజరర్ సురేష్ వెల్పుల, రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులు పాల్గొన్నారు.

Exit mobile version