Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య స్కామ్ లపై కడియం సంచలన ఆరోపణలు

స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి, కాంగ్రెస్ లోకి జంప్ అయిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. కడియం ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు.  ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..

Kadiyam Srihari: స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి, కాంగ్రెస్ లోకి జంప్ అయిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. కడియం ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు.  ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కడియం నమ్మకం ద్రోహం చేశాడని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య కూడా కడియంని పలు మార్లు విమర్శించారు. ఈ మేరకు కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వేలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కడియం, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వందల కోట్లు సంపాదించిన వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. మీ వద్ద వందల కోట్ల ఆస్తులు ఉండొచ్చు కానీ నన్ను విమర్శించే స్థాయి మీది కాదు అంటూ ఎద్దేవా చేశారు కడియం శ్రీహరి. లిఫ్ట్ ఇరిగేషన్లు కాంట్రాక్టర్ వద్ద 104 కోట్ల కమిషన్ తీసుకున్న వ్యక్తివి నీవు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

We’re now on WhatsAppClick to Join

దళిత బందులో, లిఫ్ట్ ఇరిగేషన్లలో కమిషన్ తీసుకున్నది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. నీవు కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తవా అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరారు. అదే లిఫ్ట్ ఇరిగేషన్ లో నేను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ తెలిపారు కడియం. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు తెచ్చుకోలేదా అని, మనబడి మన ప్రణాళికలో సొంత తమ్ముడికి కాంట్రాక్టు ఇప్పించలేదా అంటూ ప్రశ్నించారు.మనబడి మన ప్రణాళికలో తన తమ్ముడిపై కేసు నమోదు అయ్యింది. భూ కబ్జాలు చేశాడని పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కూడా కేసు నమోదు అయింది పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ దొంగ రాజయ్య మరో దొంగ.. ఇద్దరూ తోడుదొంగలు అంటూ ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.

Also Read: KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు