తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి (Kadiam Srihari), కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి.. లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రాజగోపాల్ అంటే.. కాంగ్రెస్‌కు పట్టిన చీడ పురుగు రాజగోపాల్‌రెడ్డి అని కడియం అన్నారు.
అసలు ఏంజరిగిందంటే..
సభలో నా గురించి సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబేనా అని కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రశ్నించారు. మాటిమాటికి నాకు మంత్రి పదవి రాలేదని బీఆర్ఎస్ నాయకులు ఫీల్ అవుతున్నారని, ఆ విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు. మంత్రులు ఎవరు కావాలనేది తమ పార్టీ అంతర్గత విషయమని.. కాంగ్రెస్ పార్టీని చీల్చడమే బీఆర్ఎస్ కుఠిల బుద్ధి అని రాజగోపాల్ మండిపడ్డారు. తాను ప్రత్యేక రాష్ట్రం తీసుకోచ్చిన ఎంపీనని, మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్ఎస్‌ను నమ్ముకుని పార్టీలో చేరిన తాటికొండ రాజయ్యకు ముందు ఉప ముఖ్యమంత్రిని చేశారని, కడియం శ్రీహరి చెప్పుడు మాటలను విని ఆయను మంత్రి పదవి నుంచి తీసేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పచ్చ కామెర్లు వచ్చినోడికి.. లోకమంతా పచ్చగా కనిపిస్తోందంటూ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. దీనిపై కడియం రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి తన గురించి మాట్లాడటం సరికాదని శ్రీహరి సూచించారు. సబ్జెక్ట్ మాట్లాడాలని చెబుతూనే వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నారని శ్రీహరి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చీడ పురుగు రాజగోపాల్ రెడ్డి అని మండిపడ్డారు. ఆ పార్టీని నాశనం చేసింది రాజగోపాల్ అని ఫైరయ్యారు.
Read Also : Sonia Gandhi: తొలిసారిగా రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు