Kadem Project : ప్రమాదం లో కడెం ప్రాజెక్ట్..చూసేందుకు వెళ్లి వెనక్కు వచ్చిన అధికారులు

కడెం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందా..? ఏ క్షణమైనా కడెం ప్రాజెక్ట్ కు పెను ప్రమాదం జరగబోతుందా..? కడెం ప్రాజెక్ట్ కు ఏమైనా అయితే ఎలా..?

Published By: HashtagU Telugu Desk
Kadem Project

Kadem Project

కడెం ప్రాజెక్ట్ ప్రమాదంలో (Kadem Project in Danger Zone) ఉందా..? ఏ క్షణమైనా కడెం ప్రాజెక్ట్ కు పెను ప్రమాదం జరగబోతుందా..? కడెం ప్రాజెక్ట్ కు ఏమైనా అయితే ఎలా..? ఇప్పుడు అధికారులు , నేతలు , రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర  (Telangana Rains) వ్యాప్తంగా గత నాల్గు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండడం తో వాగులు, వంకలతో పాటు ప్రాజెక్ట్ లన్ని కూడా పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్ట్ లకు కెపాసిటికి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం తో గేట్లన్నీ ఎత్తేసి నీటిని కిందకు వదులుతున్నారు. అయితే కడెం ప్రాజెక్ట్ మాత్రం ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాజెక్టు (Project ) సామర్థ్యం 3.5లక్షల క్యూసెక్కులు కాగా.. అంతకుమించి వరద వస్తుండడం తో ప్రాజెక్ట్ మొత్తం 18 గేట్లు ఉండగా.. అందులో ప్రస్తుతం నాలుగు గేట్లు మొరాయించాయి. దీంతో 14 గేట్లను ఎత్తి 2.19 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. మిగతా నాల్గు గేట్లను మరమ్మతు కోసం నిపుణులను పిలిపించే ఏర్పాటు చేసినట్లు అధికారులు చెపుతున్నారు.

ప్రాజెక్టు నిండుకోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టును పరిశీలించడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indra Karan Reddy), ఎమ్మెల్యే రేఖా నాయక్ (MLA Rekha Nayak), ఉన్నతాధికారులు వెళ్లారు. కానీ అక్కడున్న పరిస్థితి చూసి ఎమ్మెల్యే, అధికారులు ఉరుకులు, పరుగులతో వెనక్కి వచ్చి కారెక్కి వెళ్లిపోయారు. ఏ క్షణంలో ఏంజరుగుతుందో తెలియని పరిస్థితిని చూసి ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టినట్లు తెలుస్తుంది. వరద తగ్గితే కట్టమైసమ్మకు మొక్కు చెల్లించుకుంటానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

గత ఏడాది కూడా ఇలాగే కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద రావడం తో ప్రజలు , అధికారులు ఖంగారు పడ్డారు. ఒకానొక సమయం ప్రాజెక్ట్ కూలిపోతుందేమో అని కూడా భయపడ్డారు. కానీ ఆ తర్వాత వరద ఉదృతి తగ్గడం , వర్షాలు తగ్గుముఖం పట్టడం తో ఊపిరి పీల్చుకున్నారు.

ఇక భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తుంది. 50 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. రాత్రి వరకు ఇంకా గోదావరి వరద పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Read Also : Hydroplaning : ఘోరమైన ప్రమాద వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

  Last Updated: 27 Jul 2023, 03:00 PM IST