KA Paul : రాజీవ్ గాంధీ హత్యలో సోనియా పాత్ర ఉందన్న కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తెలంగాణ విషయాలపై తరచు మాట్లాడడం సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో పాల్ బిజీ అయ్యారు. తాజాగా తన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించిన తాను కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని పాల్ ఆరోపించారు. సోనియా గాంధీని తెలంగాణ తల్లి అంటుంటే తన హృదయం మరిగిపోతోందని, సోనియా మాయ మాటలు నమ్మకండని, ఆమె ట్రాప్ లో పడకండని పాల్ విజ్ఞప్తి చేసాడు.

బార్ లో పని చేసిన మహిళా కాబట్టి చక్కగా రాజీవ్ గాంధీ ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందని, చివరకు అయన హత్యలో ఆమె ప్రమేయం కూడా ఉందని ఆయన తెలిపారు. బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉండకూడదని, సోనియా డూప్లికేట్ ఇటలీయన్ గాంధీ అని తెలిపిన పాల్ ఆమె మోసగత్తె, సైతాను, చరిత్రహీనురాలని విమర్శించారు. తన మాట విని ఏడుగురు పెద్ద లీడర్ లు కాంగ్రెస్ పార్టీ వదిలి బయటకు వచ్చారని పాల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు కురవృద్దులని పంపి సోనియా ఏం సందేశం ఇస్తుందని పాల్ ప్రశ్నించారు.

దేశాన్ని అభివృద్ధి చేసే వరకు దేశం కోసం, తెలంగాణ కోసం పని చేస్తూనే ఉంటానని తెలిపిన పాల్ సర్వేలన్ని తమకు అనుకూలంగా ఉన్నాయని, సర్వేల్లో ప్రజలు పాల్ కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తన దగ్గర తెలంగాణ తెలంగాణ అభివృద్ధి కి సంబందించిన ప్లాన్ ఉందని, జూన్ 8 నుండి ప్రజల్లోకి వస్తున్నానని, తనని ఎవరు ఆపుతారో చూస్తానని పాల్ అన్నారు.

తెలంగాణ అమరవీరుల కొరకు తాను పోరాడతానని ప్రకటించిన పాల్ తెలంగాణ
తెలంగాణ ద్రోహుల ఆటలు సాగవని, తనపై దాడులు చేసినా ప్రజల కోసం పోరాడతానని, తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తే ఊరుకోనని పాల్ హెచ్చరించారు.