KCR : కేసీఆర్ ఓడిపోవడానికి KA పాల్ కారణమట..!!

  • Written By:
  • Publish Date - February 11, 2024 / 06:22 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు సీఎం గా పాలించిన కేసీఆర్ సైతం రెండు చోట్ల పోటీ చేయగా..ఒక స్థానం లో మాత్రమే విజయం సాధించి , కామారెడ్డి లో ఓటమి చెందారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ఫై కేసీఆర్ దృష్టి సారించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం సాధించి బిఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్..కేసీఆర్ ఫై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాను శపించడం వల్లే కేసీఆర్, కేటీఆర్ ఓడిపోయారని.. తన దీవెనల వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. సొంత ఛారిటీ కింద ఐదు లక్షల కోట్ల రూపాయలు పంచినట్లు తెలిపారు. సొంత చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరిగిన తను ఇప్పుడు ప్రపంచాన్ని వదలిపెట్టి పల్లెల్లో తిరుగుతున్నానన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే తిరగడం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అవినీతిని వేలెత్తి చూపిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీకి 54 శాతం ఓటు బ్యాంకు ఉందని అన్ని ఛానల్స్ సర్వే నివేదికలు వేశాయని కేఏ.పాల్ చెప్పుకొచ్చారు.

అలాగే ఎన్టీఆర్, బాలయోగికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇక పవన్ కళ్యాణ్ కు బీజేపీతో కలవాల్సిన అవసరం ఏముంది..? ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి సీఎం అనుకుంటే కాంగ్రెస్ కు అమ్మేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం మోడీ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నిస్తామని పార్టీ పెట్టి 25 సీట్లకు అమ్ముడుపోయారని పాల్ ఆరోపించారు. జగన్ సిద్ధం- పవన్ మేమూ సిద్ధం-చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీకి ఎలా అమ్ముడుపోయారో అర్దం కావడం లేదన్నారు.

Read Also : Bonthu Rammohan : కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్..?