KA Paul- Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul- Pawan Kalyan) పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూపై ఏపీ ఉప ముఖ్యమంత్రి అసత్య ఆరోపణలు చేశారని కేఏ పాల్ తెలిపారు. అంతేకాకుండా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడకూడదని సూచించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. అయోధ్యకు తిరుమల లడ్డూలు పంపింది జనవరిలో అని.. కల్తీ నెయ్యి విషయం బయటపడిందని జూలైలో అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తక్షణమే డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ పిచ్చికుక్క కరిసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన మాటలు దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని అన్నారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కళ్యాణ్ ఉల్లంఘించారని అన్నారు.
Also Read: Rajamouli Sentiment : రాజమౌళి సెంటిమెంట్ ప్రచారం పై ఎన్టీఆర్ ఏమన్నాడంటే..!!
అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని అన్నారు. అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో అయితే కల్తీ విషయం బయటపడ్డది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జూలైలో అని అన్నారు. పంజాగుట్ట పోలీసులతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, సి.బి.ఐ లకు ఫిర్యాదు కాపీలను పంపినట్లు తెలిపారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.