Site icon HashtagU Telugu

KA Paul : తెలంగాణలో అధికారం చేపట్టేది మీమే అంటున్న KA పాల్

Kapul Ts

Kapul Ts

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు ఆ పార్టీ అధినేత KA పాల్ (KA Paul). తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలకు గాను అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections)జరగబోతున్నాయి. దీని తాలూకా షెడ్యూల్ ను సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార పార్టీ తో పాటు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) మీడియా తో మాట్లాడుతూ..త్వరలోనే తెలంగాణలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తామని తెలిపారు. అలాగే ప్రజలను కలుసుకునేందుకు త్వరలోనే యాత్ర చేయనున్నట్లు పాల్ తెలిపారు. తెలంగాణలో 119 స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారని, అధికార BRS, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. కులమతాలకు అతీతంగా ఎన్నికల్లో గెలిచి తెలంగాణను అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ అన్నారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ చేసిన హడావిడి అంత ఇంత కాదు..ఇప్పటికే అప్పటి వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో పాల్ ఇంకెంత హడావిడి చేస్తారో అని నెటిజనులు , ఓటర్లు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

Read Also : Varahi Yatra in Telangana : తెలంగాణలో పవన్ ‘వారాహి యాత్ర ‘..