KA Paul Claims : 48 గంట‌ల్లో అరెస్ట్? ఢిల్లీ వెళ్లిన‌ క‌విత‌

ప్ర‌తిప‌క్షాల‌పై రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉప‌యోగించిన

  • Written By:
  • Updated On - March 8, 2023 / 05:06 PM IST

త‌న‌దాక వ‌స్తేగానీ నొప్పి తెలియ‌దంటారు పెద్ద‌లు. గ‌త ఎనిమిదేళ్లుగా ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డానికి  రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను  ఉప‌యోగించిన కేసీఆర్ కు ఇప్పుడు బిడ్డ వ‌ర‌కు ఈడీ(Delhi ED) వ‌చ్చేట‌ప్ప‌టికి డ్రామాలు మొద‌లు పెట్టారు. కేంద్ర సంస్థ‌లు ఈడీ, సీబీఐ రాష్ట్రంలోకి అడుగు పెట్ట‌డానికి లేద‌న్నంటు మందీమార్బలాన్ని(KCR) సిద్దం చేసుకుంటున్నారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డానికి బ‌దులుగా రాజ‌కీయ గేమ్ ను ఢిల్లీ నుంచి గల్లీ వ‌ర‌కు మొద‌లు పెట్టారు.  ఢిల్లీ వెళ్ల‌డానికి ముందుగా కేసీఆర్ తో ఫోన్ లో క‌విత మాట్లాడారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని బిడ్డ‌కు ధైర్యం నూరిపోశారు. యథాత‌దంగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని అభ‌య‌మిచ్చారు. బీజేపీ ఆకృత్యాల‌ను న్యాయ‌ప‌రంగా ఎదుర్కొందామ‌ని ధైర్యం చెప్పారు.  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బుచ్చిబాబు, రామ‌చంద్ర‌ పిళ్లై , మాగంటి త‌దిత‌ర సౌత్ టీమ్ ఫ్రెండ్స్ అంటూ క‌విత మీడియాకు చెబుతున్నారు. వాళ్లు చేసే వ్యాపారాల‌తో త‌న‌కు సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. ఎలాంటి సంబంధాలు లేక‌పోతే, మూడు నెల‌ల్లో ఏడు ప‌దుల మొబైల్స్ ఎందుకు మార్చారు? డేటాను మాయం ఎందుకు చేశారు? అనే ప్ర‌శ్న‌లు స‌గ‌టు పౌరుల‌కు ఎవ‌రికైనా వ‌స్తాయి. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌ను బీజేపీ, ప్ర‌జాశాంతి పార్టీ, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత‌లు సంధింస్తున్నారు.

ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేయ‌డానికి  రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను  ఉప‌యోగించిన కేసీఆర్ (Delhi ED)

మ‌రో 48 గంట‌ల్లో క‌విత‌ను ఈడీ అరెస్ట్(Delhi ED)  చేస్తుంద‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ జోస్యం చెబుతున్నారు. అంతేకాదు, క‌విత అరెస్ట్ ఆరంభం మాత్ర‌మేన‌ని మిగిలిన క‌ల్వ‌కుంట్ల(KCR) కుటుంబాన్ని కూడా క్ర‌మంగా జైలుకు పంపించ‌డం ఖాయ‌మ‌ని మ‌త ప్ర‌బోధ‌కుడు కేఏ పాల్ అంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన కాళేశ్వ‌రం అక్ర‌మాల‌పై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆయ‌న మాదిరిగా ష‌ర్మిల‌, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బ‌క్కా జ‌డ్స‌న్ త‌దిత‌రులు ఫిర్యాదు చేయ‌డ‌మే కాదు, క్షేత్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు కూడా చేశారు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం ప‌ట్టించుకోని సీబీఐ ఇప్పుడు రంగంలోకి దిగ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ముచ్చింత‌ల్ రామాజానుజాచార్య‌ల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా మొద‌లైన మోడీ, కేసీఆర్ మ‌ధ్య వార్ ఇప్పుడు క‌విత అరెస్ట్ వ‌ర‌కు వెళ్లింద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఇప్ప‌టీకీ బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ న‌డుస్తుంద‌ని కాంగ్రెస్ విశ్వ‌సిస్తోంది. అందుకే, క‌విత టైమ్ ఇచ్చిన‌ప్పుడు సీబీఐ విచారించింద‌ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ నోటీసులు ఇస్తే, ఈనెల 15 త‌రువాత హాజ‌ర‌వుతానంటూ ఆమె చెప్ప‌డం ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న ర‌హ‌స్య ఒప్పందాల‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది.

Also Read : KCR : జాతీయ‌వాదంపై BRS యూట‌ర్న్! కేసీఆర్ కు హ్యాండిచ్చిన స్టాలిన్ టీమ్‌!!

చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేస్తుంద‌ని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ అంటున్నారు. మీడియా వేదిక‌గా లిక్క‌ర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్లు ఫ్రెండ్స్ అంటూ క‌విత చెప్పారు. ఇదే విష‌యాన్ని విచార‌ణ సంద‌ర్భంగా చెప్ప‌డానికి ఎందుకు ఆమెకు భ‌య‌ప‌డుతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. చ‌ట్టానికి ఎవ‌రైనా ఒక‌టేన‌ని, బీజేపీ ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తోన్న అరెస్ట్ ల మాదిరిగా క్రియేట్ చేయ‌డం స‌రికాద‌న్నారు. లిక్క‌ర్ స్కామ్ చేసిన క‌విత‌కు ఇచ్చిన (Delhi ED) నోటీసుల‌ను తెలంగాణ‌కు ఇచ్చిన‌ట్టు ఫోక‌స్ చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల కూడా క‌విత‌ను అరెస్ట్ చేయాల‌ని. డిమాండ్ చేస్తున్నారు. మ‌హిళ‌లు అంటే క‌విత ఒక్క‌టి మాత్ర‌మే కాద‌ని, తెలంగాణ స‌మాజంలో ఉన్న మ‌హిళ‌ల్ని కాద‌ని కేసీఆర్(KCR) వ్య‌వ‌హ‌రిస్తూ ఆయ‌న కుమార్తెకు దోచిపెట్టార‌ని విమ‌ర్శించారు. లిక్క‌ర్ స్కామ్ చేయ‌డం సిగ్గుచేట‌ని క‌విత‌కు చుర‌క‌లు వేశారు. ఎవ‌రైనా పోయే వాళ్ల‌మేన‌ని, ఎంత సంపాదిస్తార‌ని క‌విత‌ను ప్ర‌శ్నించారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ ప్ర‌త్య‌ర్థుల‌ను ఇబ్బంది పెట్టేలా కొన్ని కేసుల్లో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత ప్ర‌మేయాన్ని తేల్చాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ హ‌నుమంత‌రావు సైతం కోరుకుంటున్నారు. ఇప్పటి వ‌ర‌కు రాష్ట్ర సంస్థ‌ల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను నిర్వీర్యం చేసిన కేసీఆర్ ఆయన కుటుంబం మీద విప‌క్షాలు ఆగ్ర‌హంగా ఉన్నారు. అందుకే, విప‌క్షాలు మూకుమ్మ‌డిగా క‌విత ఆరెస్ట్ ను కోరుకుంటున్నారు.

విప‌క్షాలు మూకుమ్మ‌డిగా క‌విత ఆరెస్ట్ ను కోరుకుంటున్నారు

మ‌హిళా దినోత్స‌వం రోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని దారుణాలను నిల‌దీస్తూ ట్యాంకు బండ్ మీద ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహం వ‌ద్ద మౌన‌దీక్ష‌కు దిగారు. తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. దానివల్ల మహిళలపై అత్యచారాలు జరుగుతున్నాయని అన్నారు. మౌన దీక్షను పోలీసులు భగ్నం చేసి షర్మిలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అత్యాచారాలు,లైంగిక వేధింపుల్లో దక్షిణ భారతంలోనే తెలంగాణను నెంబ‌ర్ 1 స్థానంలో నిలిపిన దొరను, మహిళా లోకం ఎన్నడూ క్షమించదు’ అని ట్వీట్ చేశారు. ఆ త‌రువాత లిక్క‌ర్‌ స్కామ్ గురించి మాట్లాడారు. మ‌హిళ‌ల్ని ఎలా గౌర‌వించాలో నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. సౌత్ ప‌రువు పోయేలా ఢిల్లీ వేదిక‌గా క‌విత వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ప్పుబ‌ట్టారు. లిక్క‌ర్ స్కామ్ (Delhi ED)ద్వారా తెలంగాణ ప‌రువును మంట‌గ‌లిపారని మండి ప‌డ్డారు. మొత్తం మీద క‌విత అరెస్ట్ కు కేఏ పాల్ డెడ్ లైన్ పెట్ట‌గా, విప‌క్ష నేత‌లు మూకుమ్మ‌డిగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం క‌ల్వ‌కుంట్ల (KCR) కుటుంబం మీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను చాటుతోంది.

Also Read : YS Sharmila: తెలంగాణా ఆప్ఘనిస్తాన్, కేసీఆర్‌ తాలిబన్‌.. వైఎస్‌ షర్మిల షాకింగ్ కామెంట్స్!