Site icon HashtagU Telugu

Kalvakuntla Kavitha: ఈడీ విచారణ వేళ.. కవితకు సుప్రీంకోర్టు షాక్!

Kavitha

Kavitha

దేశవ్యాప్తంగా ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసొడియో అరెస్ట్ చేయగా, తెలంగాణ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కె కవిత (kalvakuntal kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. అయితే ఈ నెల 16న మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరుకావాల్సిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమవుతోంది.

అయితే సుప్రీంకోర్టు వెంటనే స్పందించకపోవడంతో కవిత (kalvakuntal kavitha) కు షాక్ తగిలినట్టయ్యింది. ఒకవేళ సుప్రీంకోర్టు సత్వరంగా స్పందించి ఉంటే కవితకు ఎంతో కొంత మేలు జరిగి ఉండేదని పలువురు భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తెకు ఇంతకుముందు మార్చి 11న ఈడీ సమన్లు పంపగా, కనీసం 9 గంటల పాటు ప్రశ్నలవర్షం కురిపించింది. మార్చి 16, గురువారం ఆమెకు రెండోసారి కూడా ED సమన్లు పంపినట్లు సమాచారం.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఆమె (kalvakuntal kavitha) ను ప్రశ్నిస్తున్నారు. ఆమె సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. గంటల తరబడి విచారించిన తర్వాత మార్చిలో అతడిని అరెస్టు చేశారు. ఈ కేసులో 11వ అరెస్టు. ఈ కేసులో ఢిల్లీ కేబినెట్‌ మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత మనీష్‌ సిసోడియాను కూడా అరెస్టు చేశారు.

Also Read: Man and Two Wifes: ఒక భార్య వద్ద 3 రోజులు.. మరో భార్య వద్ద 3 రోజులు: గ్వాలియర్ కోర్టు షాకింగ్ తీర్పు!