Site icon HashtagU Telugu

Jupally Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు

Jupalli

Jupalli

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా జూపల్లి కృష్ణారావు విజయం సాధించి..ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 1955, ఆగస్టు 10 న జన్మించారు. జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ మాజీ కేబినేట్ మంత్రి. ఈయన తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు

జూపల్లి కృష్ణారావు 1999, 2004, 2009, 2012 ఉపఎన్నికలు, 2014లలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావు. వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరా, లీగల్ కొలతల వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఎండోమెంట్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2011, అక్టోబరు 30న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి చేరారు.

ఆయన 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచి కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు. జూపల్లి కృష్ణరావు 2018లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. బీరం హర్షవర్దన్ రెడ్డి అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో పార్టీతో అసంతృప్తితో ఉన్న ఆయన 2023 ఏప్రిల్ 09న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్త గూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నాడు.

ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి జూపల్లి విజయం సాధించారు.

Read Also : Tummala Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల