Site icon HashtagU Telugu

Telangana Congress: కోమటిరెడ్డి ఇంట్లో జూపల్లి కృష్ణారావు భేటీ

Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతలు చేరేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణపై ఫోకస్ చేసింది. ఈ మేరకు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.నిన్న శనివారం అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర రెడ్డి కాంగ్రెస్ లీడర్ మల్లు రవిని కలవడం చర్చనీయాంశమైంది. ఇక తాజగా జూపల్లి కృష్ణారావు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. కోమటిరెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు.

ఏ పార్టీలో చేరతానో ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు జూపల్లి. కోమటితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు ఆయన కూల్ గా సమాధానం ఇచ్చారు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జూపల్లి కృష్ణరావు తెలిపారు. కాంగ్రెస్ లో చేరడం అనేది నా ఒక్కడి అభిప్రాయం కాదని, అనుచరులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

ఎంపీ కోమటి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరితే బాగుటుందని జూపల్లికి చెప్పినట్టు ఆయన అన్నారు. త్వరలో కాంగ్రెస్ పరిస్థితి మారబోతుందని, 18, 19 తేదీలలో ప్రియాంక గాంధీ తెలంగాణాలో భారీ బహిరంగ సభలకు హాజరవుతున్నారని చెప్పారు. ప్రియాంక రాక తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ ఏంటో మీరే చూస్తరుగా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారాయన.

Read More: Long Overdue: 81 ఏళ్ళ తర్వాత లైబ్రరీకి చేరుకున్న పుస్తకం.. చివరికి ఏం జరిగిందంటే?